వంతెన నిర్వహణ ఒరెవా కంపెనీది.. నిర్లక్ష్యం దానిదేనా?
గుజరాత్ లో వంతెన కూలిన సంఘటనలో ఇప్పటి వరకూ 141 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
గుజరాత్ లో వంతెన కూలిన సంఘటనలో ఇప్పటి వరకూ 141 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. తీగల వంతెన కూలిన ఘటనలో ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు కుటుంబంలో పన్నెండు మంది మరణించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రాజ్‌కోట్ పార్లమెంటు సభ్యుడు మోహన్ భాయ్ కల్యాణ్జీ కుందారియా సోదరి కుటుంబ సభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు.
బీజేపీ ఎంపీ కుటుంబంలో...
బీజేపీ ఎంపీ సోదరి కుటుంబంలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎవరి వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందన్న దానిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఒరేవా కంపెనీ ఈ వంతెనను నిర్వహిస్తుంది. పెద్దలకు 17, పిల్లలకు 12 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. మర్మమత్తులు చేపట్టిన తర్వాత నాలుగు రోజుల క్రితమే ఈ వంతెనలో సందర్శకులకు అనుమతించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. కింద బురద ఎక్కువగా ఉండటంతో నీటిలో పడిన వెంటనే ఇరుక్కుపోయిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మానవతప్పిదం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒరేవా సంస్థ పరిమితికి మించి సందర్శకులను అనుమతించిందన్న ఆరోపణలున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.