రోడ్డు ప్రమాదంలో టిడిపి నేత మృతి
బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనుచరుడు రాజవర్థన్ రెడ్డి..;
గద్వాల : తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిడిపి నేత మృతి చెందారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనుచరుడు రాజవర్థన్ రెడ్డి మృతి చెందారు. గద్వాల జిల్లా పరిధిలోని ఉండవల్లి సమీపంలో ఇటిక్యాలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాజవర్థన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇటిక్యాలపాడు వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజవర్థన్ రెడ్డి మృతి చెందారు.