Breaking : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు లోయలో పడింది.;

Update: 2024-08-23 07:14 GMT

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు లోయలో పడింది. పొఖరా నుంచి ఖాట్మండు వెళుతుండగా ఈ బస్సు లోయలో పడింది. అయితే ఈ బస్సులో నలభై మంది భారతీయులున్నట్లు చెబుతున్నారు. అయితే వీరిలో చాలా మంది గల్లంతయినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

భారీ వర్షాలు కురుస్తుండటంతో...
ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. ఎందరు గల్లంతయ్యారన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. తనాహున్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే అతి వేగంతోనే బస్సు అదుపు తప్పి లోయలో పడిందని చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.


Tags:    

Similar News