ఎల్బీనగర్ సంతోషిమాత ఆలయంలో భారీ చోరీ
హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. నిర్మానుష్య ప్రదేశాలు టార్గెట్ గా దుండగులు రెచ్చిపోతున్నారు.;
హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. నిర్మానుష్య ప్రదేశాలు టార్గెట్ గా దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఎల్బీనగర్ హస్తినాపురం నార్త్ జోన్ లో ఉన్న సంతోషిమాత ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. దుండగులు ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించి, హుండీ తాళాలను పగులగొట్టి సుమారు 30 తులాల బంగారాన్ని అపహరించారు. దొంగతనం చేసే సమయంలో తమ ఆచూకీని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు చాలా తెలివిగా సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు దుండగులు.
అర్ధరాత్రి....
సమాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ తో కలిసి సంతోషిమాత ఆలయం వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆలయ అర్చకులను ప్రశ్నించగా.. శుక్రవారం అర్థరాత్రి ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని బదులిచ్చారు. క్లూస్ హుండీ పై, ఆలయ ద్వారాలపై ఉన్న ఫింగర్ ప్రింట్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు