జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం...9 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు;

Update: 2022-04-01 03:54 GMT

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న ఒక బృందం ప్రయాణిస్తున్న టాటా సుమో అదుపుతప్పి లోయపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు.

లోయలో పడటంతో.....
పూంఛ్ జిల్లాలోని మర్హా గ్రామం నుంచి బుప్లియాజ్ వైపు వస్తున్న టాటా సుమో వాహనం తరన్ వలి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.


Tags:    

Similar News