Big Breaking : తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురి మృతి

తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు జరిగింది;

Update: 2024-05-01 05:30 GMT

తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురు కార్మికులు మరణించగా, పన్నెండు మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరం ఎగిరిపడ్డాయని క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

12 మందికి గాయాలు...
అయితే పేలుడు సంభవించడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. క్వారీలో జిలిటెన్ స్టిక్స్ ఉపయోగిస్తారు. అది ఏమైనా పేలిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన పన్నెండు మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News