కర్నూలులో హర్యానా దొంగల ముఠా
కర్నూలు నగరంలో దొంగల హల్ చల్ చేశారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్ లో ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు;
కర్నూలు నగరంలో దొంగల హల్ చల్ చేశారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్ లో ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఏటీఎంను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అటుగా పెట్రోలింగ్ కు వెళుతున్న పోలీసులు గమనించడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోతున్న వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు దొంగలు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులపై కాల్పులు...
అయితే పోలీసులపై దొంగలు కాల్పులు జరపడంతో వారు పట్టుకోలేకపోయారు. పోలీసులపై నలుగురు దొంగలు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వీరంతా హర్యానాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఎస్‌బీఐ ఏటీఎంలోని మిషన్ ను ఎత్తుకెళ్లడానికి లారీని కూడా సిద్ధం చేసుకోవడం విశేషం. అరెస్టయిన వారిని ముస్తాఫా, తాహెర్ లుగా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. డోన్ వైపు వారు వెళ్లినట్లు కనుగొన్నారు.