కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు;

Update: 2022-03-14 02:07 GMT

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. కెనడాలోని ఒంటారియో హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన వ్యాన్ ట్రాలీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఐదుగురు భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం.

వ్యాన్ వేగంగా వచ్చి....
భారతీయ విద్యార్థులు ఓ ప్యాసింజర్ వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. ఈ వ్యాన్ వేగంగా వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జస్పీందర్ సింగ్, హరిప్రీత్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ లు మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News