డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

చెన్నైలో జరుగుగున్న పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఒక యువకుడు కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు

Update: 2023-03-28 04:16 GMT

చెన్నైలో జరుగుగున్న పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఒక యువకుడు కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. డీజే సాంగ్ జరుగుతుందడగా యువకుడు కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు స్నేహితులు ప్రయత్నించారు. దారి మధ్యలోనే ఆ యువకుడు చనిపోయినట్లు తెలిసింది.

కర్నూలుకు చెందిన...

మృతి చెందిన యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరై ఆ యువకుడు మృతి చెందాడని చెబుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.


Tags:    

Similar News