యూపీ లో దారుణం.. 17 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అరాచకం.
యూపీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. కామావతారం ఎత్తాడు.;
యూపీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. కామావతారం ఎత్తాడు. తన కామవాంఛ తీర్చుకుని, ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది విద్యార్థినులపై స్కూల్ ప్రిన్సిపల్ యోగేష్ కుమార్ తో పాటు, అతని సహచరుడు సైతం వేధింపులకు పాల్పడినట్లు స్థానిక పీఎస్ లో కేసు నమోదైంది. ప్రాక్టికల్స్ ఉన్నాయి.. స్కూల్ కి రమ్మని పిలిచి, ఆ రాత్రికి అక్కడే ఉండాలని సూచించాడు. ప్రిన్సిపల్ మాట కాదనలేక అక్కడే ఉండిపోయిన బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి.. స్పృహ కోల్పోయాక.. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.