చందానగర్ ఫ్యామిలీ మరణాల కేసులో ట్విస్ట్..
అనంతరం పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ఈ ఘటనలో..;
చందానగర్లో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య అంటూ.. ఈ రోజు ఉదయం బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వారిలో ముగ్గురివి హత్యలుగా తేల్చారు. చందానగర్ పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉంటున్న ఓ ఫ్యామిలీ శుక్రవారం నుంచి ఇంటి నుండి బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ ఇంటి నుంచి దుర్గంధం రావడంతో తలుపులు పగలగొట్టి చూడగా.. భార్య సుజాత, భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగతజీవులుగా కనిపించారు.
అనంతరం పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ఈ ఘటనలో భర్త నాగరాజే హంతకుడని తేల్చారు పోలీసులు. భార్యపై ఉన్న అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి తెరలేపినట్లు తెలిపారు. ముక్కుపచ్చలారని పిల్లలపై, భార్యపై కత్తెరతో దాడి చేసి హతమార్చి.. ఆపై అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు. భార్య భర్తల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.