శిల్పాకు బెయిల్ నిరాకరణ
ప్రముఖులను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ ను నిరాకరించింది.
ప్రముఖులను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ ను నిరాకరించింది. ఆమెకు రిమాండ్ విధించింది. కాగా మూడు రోజుల విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో శిల్పా చౌదరిని పోలీసులు హాజరు పర్చారు. శిల్పా చౌదరిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరారు.
ఒక రోజు కస్టడీకి....
మూడు రోజుల కస్టడీలో శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులకు సెలవు దినాలని, బ్యాంకు లావాదేవీలపై విచారణ చేయలేక పోయామని కోర్టుకు పోలీసులు వివరించారు. దీంతో కోర్టు శిల్పా చౌదరిని ఒకరోజు మాత్రమే కస్డడీకి అనుమతించింది. రేపు మరసారి శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచలగూడ జైలుకు శిల్పాను తరలించారు.