కూలీల ఆటోను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు మృతి

పత్తితీతకు వెళ్తున్న కూలీల ఆటోను యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో;

Update: 2021-12-20 08:06 GMT

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడో మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పత్తితీతకు వెళ్తున్న కూలీల ఆటోను యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో షేక్ దరియాబి (55), బేగం (52) అనే ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్ , వడ్డెర కాలనీకి చెందిన మహిళా కూలీలుగా గుర్తించారు. పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తితీత పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News