దేవుడు చెప్పాడంటూ.. ఒంటికి నిప్పు పెట్టుకున్న మహిళ

అత్తాపూర్ లో శివాని అనే మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. మంగళవారం ఉదయం ఆమె రోడ్డుపైకి వచ్చి మెట్రో పిల్లర్ నంబర్ 133..;

Update: 2023-04-11 10:01 GMT

ఈ ఆధునిక యుగంలో మనిషి కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ.. అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఇంకా చాలామంది మూఢనమ్మకాల్లోనే బ్రతుకుతుండటం గమనార్హం. తాజాగా ఓ మహిళ తనకు దేవుడు చెప్పాడు అంటూ.. ఒంటికి నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావు, బ్రతుకుల మధ్య పోరాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో జరిగింది.

అత్తాపూర్ లో శివాని అనే మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. మంగళవారం ఉదయం ఆమె రోడ్డుపైకి వచ్చి మెట్రో పిల్లర్ నంబర్ 133 వద్ద హఠాత్తుగా పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులకు అక్కడేం జరుగుతుందో తెలిసే లోపే ఇదంతా జరిగిపోయింది. దేవుడు చెప్పాడు అని అరుస్తూ ఆ మహిళ నిప్పుపెట్టుకుందని చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రజలు మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయొద్దని సూచించారు.


Tags:    

Similar News