భార్యను చంపి రెండు ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచిన భర్త

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త రెండు ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచాడు.;

Update: 2022-06-06 12:08 GMT

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త రెండు ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచాడు. అనిల్ కుమార్, సరోజలు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లి కనిపించట్లేదంటూ పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా ఈ దారుణం బయట పడింది.

రహ్మత్ నగర్‌ దగ్గర సుభాష్ నగర్‌లో ఓ మహిళ మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి వాటర్ డ్రమ్‌లో దాచారు. ఘటన తర్వాత ఆమె భర్త పరారీలో ఉన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సరోజ అనే మహిళ తన భర్త అనిల్‌తో కలిసి నివసిస్తోంది. అనిల్ సరోజతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. శుక్రవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగాక.. అనిల్ ఆమెను కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. అతను ఆమె శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి, చిన్న నీటి డ్రమ్ములో ఉంచి, అక్కడి నుండి పారిపోయి బయట నుండి తలుపు లాక్ చేసాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సరోజ బంధువులు ఫోన్ చేయగా ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో.. అనుమానం వచ్చింది. వారు ఇంటికి చేరుకుని తలుపులు తెరవగా.. మృతదేహం బయట పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News