విషాదం.. యువకుడి ప్రాణం తీసిన రమ్మీ

ఒకట్రెండుసార్లు గెలిచి.. డబ్బులొచ్చేసరికి.. ఈజీగా మనీ సంపాదించవచ్చనుకున్నాడు. రమ్మీ యాడ్లు చూసి.. ఇందులోకి దిగిన

Update: 2022-09-04 14:13 GMT

ఆన్ లైన్ గేమ్ లు, ఆన్ లైన్ లోన్ యాప్ లు యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఈజీ మనీ కోసం ఆన్ లైన్ లో గేమ్ లు ఆడి.. డబ్బులు పోగొట్టుకుని, ఆ ఆటను మానలేక మళ్లీ అప్పులు చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఓబులదేవర చెరువు మండలం, కొండకమర్లలో హేమంత్ బాబు అనే యువకుడు బవన్మరణానికి పాల్పడ్డాడు. కొండకమర్లలోని పశువుల ఆస్పత్రి దగ్గర్లో ఉంటున్న హేమంత్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతను ఆన్ లైన్ రమ్మీ గేమ్స్ కి అలవాటుపడ్డాడు.

ఒకట్రెండుసార్లు గెలిచి.. డబ్బులొచ్చేసరికి.. ఈజీగా మనీ సంపాదించవచ్చనుకున్నాడు. రమ్మీ యాడ్లు చూసి.. ఇందులోకి దిగిన హేమంత్ కి అక్కడ ప్రకటనల్లో కనిపించేది ఒకటి.. ఇక్కడ అసలు రియల్ గేమ్ మరొకటిగా కనిపించ సాగింది. ఈ ఆట పోతే.. మరొక ఆటగా ఫీలైన హేమంత్ ఆడుతూ వెళ్లాడు. అలా రమ్మీ ఆడుతూ భారీ నష్టాలను చూశాడు. అప్పుల బెడద ఎక్కువైంది. ప్రతిరోజూ అప్పులవాళ్లు పెట్టే టార్చర్ భరించలేక.. సంపాదించే దారి కనిపించక ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి.. చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి వచ్చి విచారించారు. హేమంత్ భార్య ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేశారు.



Tags:    

Similar News