నీకో సర్ ప్రైజ్.. కళ్లు మూసుకోమంది.. కాబోయే భర్తను ఏమి చేసిందంటే..!

'నీతో మాట్లాడాలి, ఓసారి రా' అంటూ కాబోయే భర్తకు ఫోన్ చేసింది. వెంటనే ఆ యువకుడు రావడంతో, అతనిని సాయిబాబా..;

Update: 2022-04-19 03:44 GMT

పెళ్లి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి.. ఏదో ఒక రకంగా ఆపడానికి ట్రై చేయాలి..! కానీ హత్యలు-చంపడాలు వంటివి చేస్తే మాత్రం జీవితాలే నాశనం అవుతాయి. అనకాపల్లి జిల్లా రావికమతంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని యువతి పెద్ద ప్లాన్ వేసింది. పెళ్లి చేసుకుందామంటేనే అబ్బాయిలు భయపడేలా చేసింది ఆ అమ్మాయి.

కాబోయే భర్త పై దాడి చేసింది యువతి.. కాబోయే భర్తను, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని పిలిచి దారుణానికి తెగబడింది. కళ్ళు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తానని చెప్పి.. తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చాడు యువకుడు. ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు ఆ యువకుడు. తనకు పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేస్తున్నారని చెప్పింది.
'నీతో మాట్లాడాలి, ఓసారి రా' అంటూ కాబోయే భర్తకు ఫోన్ చేసింది. వెంటనే ఆ యువకుడు రావడంతో, అతనిని సాయిబాబా గుడి వున్న కొండపైకి తీసుకెళ్లింది. 'సర్ ప్రైజ్' అంటూ కళ్లు మూసుకోవాలని కోరింది. కాబోయే భార్య అడగడంతో అతడు వెంటనే కళ్లు మూసుకున్నాడు. యువతి తనతో పాటు తెచ్చుకున్న పదునైన చాకుతో అతడి గొంతుకోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడి పేరు రాము నాయుడు, అతడి స్వస్థలం పాడేరు. ఆ యువతిది రావికమతం. వీరి పెళ్లి వచ్చే నెల 28న జరగాల్సి ఉంది. యువకుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News