రైలెక్కి సెల్ఫీ తీసుకుంటూ మృతి

ఆగి ఉన్న రైలు ఎక్కి ఒక యువకుడు సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుత్తు తీగలు తగిలి మరణించిన సంఘటన ఒడిశా రాయగడ జల్లాలో జరిగింది;

Update: 2023-02-16 03:11 GMT

సెల్ఫీ ఇప్పుడు యువతకు క్రేజ్ గా మారిపోయింది. సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో పోస్టు చేసి తెలియని ఆనందాన్ని అనుభవించే నేటి యువత ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. ఆగి ఉన్న రైలు ఎక్కి ఒక యువకుడు సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుత్తు తీగలు తగిలి మరణించిన సంఘటన ఒడిశా రాయగడ జల్లాలో జరిగింది.

ఆగి ఉన్న రైలు ఎక్కి...
సుధీర్ గొరడా అనే యువకుడు కేసింగ్‌పూర్ సమితిలోని భల్లూ మస్కా స్టేషన్ సమీపంలో ఆగిఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కాడు. రైలు ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుత్తు లైన్లు తగిలి అక్కడికక్కడమే మృతి చెందాడు. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోయింది. సుధీర్ గొరడా కాశీపూర్ సమితి గుడుబల్లి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News