ఫ్యాక్ట్ చెక్: ఈ వీడియో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవానికి సంబంధించినదా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం రథోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

Update: 2022-03-29 05:55 GMT

క్లెయిమ్: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. వీడియో తమిళనాడు లోని తిరువారూర్ రథోత్సవానికి సంబంధించినది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం రథోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
వేల సంఖ్యలో జనం రథం చుట్టూ ఉన్నారు. భక్తితో వారు రథం పైన ఉన్న దేవుడిని మొక్కుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:
వీడియో స్క్రీన్‌షాట్‌లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సెర్చ్ రిజల్ట్స్ లో ఇలాంటి వీడియోలు చాలా కనుగొనబడ్డాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అదే వీడియోను భిన్నమైన వివరాలను ఇచ్చి పోస్ట్ చేసారు - "తిరువారూర్ రథోత్సవం, తమిళంలో తిరువారూర్ తేరోట్టం అని పిలుస్తారు". "Tiruvarur Chariot festival, known in Tamil as Tiruvarur Therottam".
ఇక వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కామెంట్స్ సెక్షన్స్ లో ఇది కదిరికి సంబంధించినది కాదని.. తిరువారూర్ రథోత్సవం అని పలువురు చెప్పుకొచ్చారు.
Full View
మేము గూగుల్ లో తిరువారూర్ రథోత్సవంకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చూశాం.. వైరల్ వీడియోలో ఉన్న రథం తిరువారూర్ కు చెందినదేనని తెలిసింది.
అలాగే కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా పరిశీలించాం.. అందులో ఉన్న రథం వేరేలా ఉంది.
Full View

ఇక వైరల్ వీడియోలో తమిళంలో బోర్డులు ఉండడాన్ని మేము గుర్తించాం.. కదిరి ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి.. హోర్డింగ్ లు తెలుగులో ఉంటాయి. కాబట్టి రెండు వీడియోలు భిన్నమైనవని తేలింది. తిరువారూర్ తమిళనాడు రాష్ట్రంలోనిది.

ఇక తెలుగు పోస్ట్ స్థానిక కదిరి రిపోర్టర్లను సంప్రదించింది.. వారు కూడా ఈ వీడియో కదిరికి సంబంధించినది కాదని ధృవీకరించారు.


క్లెయిమ్: ఈ వీడియో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథోత్సవానికి సంబంధించినది
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Video shows the chariot festival of Lakshmi Narasimha Swamy Temple at Kadiri in AP.
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News