ఫ్యాక్ట్ చెక్: ఎయిరిండియా సీనియర్ సిటిజన్లకు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం లేదు

ఎయిరిండియా కంపెనీ సీనియర్ సిటిజన్లకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ ఉందంటూ వాట్సాప్ లో మెసేజీలు వైరల్ అవుతున్నాయి. టాటా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానాలలో సీనియర్ సిటిజన్లకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయని ఆ వైరల్ మెసేజీలో చెప్పుకొచ్చారు.

Update: 2023-06-14 03:38 GMT

ఎయిరిండియా కంపెనీ సీనియర్ సిటిజన్లకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ ఉందంటూ వాట్సాప్ లో మెసేజీలు వైరల్ అవుతున్నాయి. టాటా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానాలలో సీనియర్ సిటిజన్లకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయని ఆ వైరల్ మెసేజీలో చెప్పుకొచ్చారు.


“గ్రేట్ న్యూస్, ఎయిర్ ఇండియా TATA భారతదేశంలో శాశ్వతంగా నివసిస్తున్న, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ విమాన ఛార్జీలను తగ్గించేసింది , భారతదేశంలో ప్రయాణించడానికి సగం ధరకే ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్లను పొందండి. దయచేసి ఈ విషయాని మీ కుటుంబాలలోనూ, స్నేహితుల ఇళ్లలోనూ ఉన్న సీనియర్ సిటిజన్లకు తెలియజేయండి.

(“Great News, Air India TATA passes the airfare for all senior citizens of Indian nationality and permanently residing in India, over 60 years of age get Air India flight tickets at half the price for travel within India. Please inform senior citizens belonging to your families and friends.”) అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.

www.airindia.com/senior-citizen-concession.htm” అంటూ లింక్ ను కూడా ఈ వైరల్ మెసీజీలో ఉంచారు.



Full View


Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న మెసేజీలో ఎటువంటి నిజం లేదు. ఎయిర్ ఇండియా టాటా సీనియర్ సిటిజన్లకు 50% రాయితీని అందించడం లేదు.. కేవలం 25% మాత్రమే రాయితీని అందిస్తోంది.

వైరల్ మెసేజీలో ఇచ్చిన లింక్ పని చేయడం లేదు. మేము కీ వర్డ్స్ ను ఉపయోహించి “Air India Tata providing 50% concession in airfare” అంటూ సెర్చ్ చేశాం. అయితే ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లో సీనియర్ సిటిజన్లకు కేవలం 25 శాతం డిస్కౌంట్ మాత్రమే ఇస్తున్నట్లు క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఎకానమీ క్యాబిన్‌లో ఎంచుకున్న బుకింగ్ పై ఛార్జీలో 25% రాయితీ అని స్పష్టంగా తెలిపే పేజీని వెబ్‌సైట్‌లో కనుగొన్నాము.

వెబ్‌సైట్ “బేసిక్ ఛార్జీలో 25% రాయితీ తగ్గింపు. ఎకానమీ క్యాబిన్లకు సంబంధించి ఎంచుకున్న బుకింగ్ తరగతులకు ఇది వర్తిస్తుంది” అని ఉంది. రాయితీని పొందడానికి ప్రయాణికులు బయలుదేరడానికి కనీసం 3 రోజుల ముందు టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని సూచించారు.

https://www.airindia.com/in/en/book/concessionary-fares/other-concessions.html

నివేదికల ప్రకారం, ఎయిర్ ఇండియా డిసెంబరు 2020లో సీనియర్ సిటిజన్‌ల కోసం డిస్కౌంట్ పథకాన్ని ప్రారంభించింది. ఇది విమాన టిక్కెట్‌లపై 50% వరకు తగ్గింపుతో కూడిన ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా అందించే డిస్కౌంట్ ఆఫర్‌ను పొందేందుకు, సీనియర్ సిటిజన్‌లు కనీసం 3 రోజుల ముందుగా విమాన టిక్కెట్‌లను కొనుగోలు చేయాలి.

అయితే ఎయిర్ ఇండియా సెప్టెంబర్ 2022లో డిస్కౌంట్ ఆఫర్‌ను 25%కి తగ్గించింది. ఎకనామిక్ టైమ్స్, ఇతర మీడియా సంస్థల ప్రకారం, మొత్తం మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 29, 2022 తర్వాత రాయితీ ధరను 25%కి సవరించాలని ఎయిర్‌లైన్ నిర్ణయించింది.

సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ఛార్జీలో 50% వరకు రాయితీలు ఇస్తున్నట్లు చెబుతున్న మెసేజీలో ఎటువంటి నిజం లేదు. ఎయిర్‌లైన్ ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్‌లకు 25% రాయితీని మాత్రమే అందిస్తోంది.

Claim :  American DNA expert says Congress leader Rahul Gandhi is not the son of former PM Rajiv Gandhi.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News