ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ భవనాలను 370 కోట్ల రూపాయలకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టిందని ఆంధ్రజ్యోతి కథనం అబద్ధం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కారణంగా

Update: 2024-03-19 17:43 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్ల రుణం పొందిందని పత్రికలో ఆరోపించారు. మొదట ప్రభుత్వం రుణం కోసం ICICI బ్యాంక్‌ను సంప్రదించిందని.. అయితే అది జరగలేదని.. ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను ఆశ్రయించారని కథనంలో పేర్కొన్నారు. సచివాలయ భవనాలపై మొత్తం నిర్మాణ వ్యయంలో సగం రుణంగా అందించడానికి అంగీకరించిందని ఆంధ్రజ్యోతి కథనంలో ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ చర్యను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. "రాష్ట్రానికి ఎంత అవమానకరం...ఎంత బాధాకరం...ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు....తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!" అంటూ పోస్టు పెట్టారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మార్చి 4, 2024 నాటి ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. AP జలవనరుల శాఖ మంత్రి, YSRCP నాయకుడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. టీడీపీ మీడియా చేసిన కట్టుకథలు అని కొట్టిపారేశారు. రాంబాబు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా అలాంటిదేమీ జరగలేదు. ప్రజల దృష్టిని మరల్చి.. ఏదో ఘోరం జరుగుతున్నట్లు ప్రచారం చేసే ప్రయత్నం, టీడీపీ చేస్తున్న ఇలాంటి వ్యూహాలు ప్రజలకు బాగా తెలుసు, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మనవి." అంటూ చెప్పుకొచ్చారు.
మార్చి 4, 2024 నాటి తెలుగు గ్లోబల్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, సచివాలయ భవనాలను ప్రభుత్వం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు తాకట్టు పెట్టిందన్న వాదనను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (AP CRDA) ఖండించింది.
సచివాలయ భవనాల తాకట్టుకు సంబంధించి ఆంధ్రజ్యోతి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ APCRDA తమ X హ్యాండిల్‌ లో ప్రకటనను కూడా విడుదల చేసింది.

మార్చి 5, 2024న ప్రచురితమైన సాక్షి నివేదిక ప్రకారం.. రాష్ట్ర సచివాలయ భవనాలను రూ. 370 కోట్ల రుణానికి తాకట్టు పెట్టారనే వార్తలను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖండించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలను తనఖా పెట్టడంపై వచ్చిన అనేక పోస్ట్‌లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతినిధి స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ. 370 కోట్లు తీసుకుందనే సమాచారం పూర్తిగా అబద్ధం.. ప్రజలను తప్పుదారి పట్టించేదని మేము తెలియజేయాలనుకుంటున్నాము." అంటూ వివరణ తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా ఈ వార్తలను ఫేక్ అని పేర్కొంటూ కొట్టిపారేసింది. మార్చి 5, 2024 నాటి పోస్ట్‌లో.. "ఆంధ్రజ్యోతి దినపత్రికలో మార్చి 3, 2024న 'తాకట్టులో సచివాలయం' శీర్షికతో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్వయంగా ఈ కథనాన్ని ఖండించింది." అని వివరణ ఇచ్చింది.

"‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఈ కథనాన్ని స్వయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖండించింది.
‘‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మార్చి 3న వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. దీన్ని మేం ఖండిస్తున్నాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా చూడవచ్చు." అంటూ పోస్టును మేము ఫ్యాక్ట్ చెక్ టీమ్ పెట్టడాన్ని గమనించాం.

ఆంధ్రజ్యోతి నివేదికను ఏపీసీఆర్‌డీఏ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కొట్టిపారేసినప్పటికీ.. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు.


Claim :  A report by Telugu daily Andhrajyothy alleges that the Jagan Mohan Reddy-led government secured a loan of Rs 370 crore from HDFC Bank by pledging the state Secretariat buildings in Amaravati as collateral
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News