ఫ్యాక్ట్ చెక్: అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ కు వెళ్ళినప్పుడు ఆయన మద్దతుదారులు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారా..?
అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జైపూర్ కు వెళ్లారు. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమికూడారు. అసదుద్దీన్ ఒవైసీ చుట్టూ ఉన్న మద్దతుదారులు 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదాలు చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
క్లెయిమ్: అసదుద్దీన్ జైపూర్ కు వెళ్ళినప్పుడు ఆయన మద్దతుదారులు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేశారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జైపూర్ కు వెళ్లారు. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమికూడారు. అసదుద్దీన్ ఒవైసీ చుట్టూ ఉన్న మద్దతుదారులు 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదాలు చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
ఒవైసీ పర్యటన సందర్భంగా జైపూర్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు లేవనెత్తడంతో వీడియో వైరల్ అవుతుందని పేర్కొంటూ ఇదే వీడియోను అనేక నివేదించాయి. మీడియా సంస్థలుజీ రాజస్థాన్, అమర్ ఉజాలా, ఫస్ట్ ఇండియా వంటి వెబ్ సైట్స్ ఒవైసీ పర్యటన సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు వినిపించాయని.. అయితే తేదీ తెలియదని చెప్పుకొచ్చారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
మా టీమ్ వీడియోను నిశితంగా పరిశీలించగా.. వైరల్ వీడియోలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు లేవనెత్తలేదు. మద్దతుదారులు 'ఒవైసీ సాబ్ జిందాబాద్' అని అరిచినట్లు గుర్తించారు. 21 సెకన్ల టైమ్‌స్టాంప్ వద్ద మనం 'ఒవైసీ సాబ్ జిందాబాద్' అని ఒక వ్యక్తి నినాదం మనం వినవచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్న మద్దతుదారులు కూడా దాన్నే గట్టిగా అరిచారు. "ఒవైసీ సాబ్ జిందాబాద్" అని మీరు స్పష్టంగా వినగలిగే మరొక కోణం నుండి మేము వీడియోను కనుగొన్నాము.కొన్ని మీడియా సంస్థలు జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవను సంప్రదించి, వైరల్ వీడియోలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు గురించి అడగగా.. ఆయన ఖండించారు. "ఈ వీడియో జైపూర్‌లో చిత్రీకరించబడింది. మా దర్యాప్తులో, వైరల్ వీడియోలో ఎటువంటి అభ్యంతరకరమైన నినాదాలు లేవనెత్తినట్లు మాకు కనిపించలేదు" అని సీపీ శ్రీవాస్తవ మీడియాకి తెలిపారు.
జైపూర్ పోలీసులు వైరల్ వీడియోకు సంబంధించి ఒక వినియోగదారుకు ట్విట్టర్‌లో సమాధానమిస్తూ, "జైపూర్ పోలీసులు వీడియోలోని వాస్తవాలను ధృవీకరించారు. దేశ వ్యతిరేక నినాదాలు లేవనెత్తడానికి సంబంధించి ఎటువంటి వాస్తవాన్ని కనుగొనలేదు, అలాంటి పుకార్లను నమ్మకండి" అని పేర్కొన్నారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
క్లెయిమ్: అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ కు వెళ్ళినప్పుడు ఆయన మద్దతుదారులు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, కొన్ని మీడియా సంస్థలు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Video shows Pakistan Zindabad slogans raised by Asaduddin Owaisi supporters in Jaipur, Rajasthan
Claimed By : Social Media Users
Fact Check : False