ఫ్యాక్ట్ చెక్: భజరంగ్ దళ్ కార్యకర్తలకు మారణాయుధాలతో ట్రైనింగ్ ఇచ్చారా..?
భజరంగ్ దళ్ కార్యకర్తలకు మారణాయుధాలతో కర్ణాటక రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వారి చేతుల్లోకి త్రిశూలం వంటివి కూడా ఉన్నాయి.
క్లెయిమ్: భజరంగ్ దళ్ కార్యకర్తలకు మారణాయుధాలతో ట్రైనింగ్ ఇచ్చారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
భజరంగ్ దళ్ కార్యకర్తలకు మారణాయుధాలతో కర్ణాటక రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వారి చేతుల్లోకి త్రిశూలం వంటివి కూడా ఉన్నాయి.
పొన్నంపేటలోని సాయిశంకర పాఠశాలలో ముగిసిన ఎనిమిది రోజుల 'శౌర్య శిక్షణ వర్గ' శిక్షణపై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపి అప్పచ్చు రంజన్, కెజి బోపయ్య, ఎమ్మెల్సీ సుజా కుశలప్ప హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు కూడా ఇక్కడ శిక్షణ పొందారు. 'త్రిశూల దీక్ష' సందర్భంగా త్రిశూలాన్ని పట్టుకోవడమే కాకుండా, ఆయుధాలు కాల్చడంలో శిక్షణ పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

తమిళనాడు, పుదుచ్చేరి & గోవా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే దినేష్ గుండూరావు ఒక ట్వీట్‌లో, "భజరంగదళ్ సభ్యులకు ఎందుకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు? సరైన లైసెన్స్ లేకుండా ఆయుధాలలో శిక్షణ ఇవ్వడం నేరం కాదా? ఇది ఉల్లంఘన కాదా? @BJP4India నాయకులు ఎందుకు బహిరంగంగా ఈ కార్యకలాపానికి హాజరవుతున్నారు, మద్దతు ఇస్తున్నారు?" అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ట్వీట్ చేశారు. "ఈ వయస్సులో, చాలా మంది యువకులు కలలు సాకారం చేసుకోడానికి బయలుదేరారు. మతం పేరుతో హింస చెలరేగేలా చేయడానికి శిక్షణ ఇస్తూ భజరంగ్ దళ్ యువకుల జీవితాలను నాశనం చేస్తోంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి" అని అన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
అయితే వారి చేతుల్లో ఉన్నవి ఎయిర్ పిస్టల్స్ అని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు. ఇక చేతుల్లో త్రిశూలాలు ఉన్న వారంతా త్రిశూల దీక్ష చేస్తున్న వారేనని తెలిపారు.కొడగు జిల్లాలోని పొన్నంపేటలోని సాయిశంకర్ విద్యాసంస్థలో మే 5 నుండి 11 వరకు జరిగిన 'శౌర్య శిక్షణ వర్గ'లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు.
భజరంగ్ దళ్ నిర్వహించిన ఈ క్యాంపులో దాదాపు 400 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త మాట్లాడుతూ, ఈ శిబిరంలో పాల్గొన్న వ్యక్తులు ఆత్మరక్షణలో శిక్షణ పొందారు. ఆయుధాల పంపిణీ అన్నది జరగలేదు. జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తెలిపారు.
శిబిరం నిర్వహించిన పాఠశాల అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రాంగణాన్ని చాలా సంవత్సరాలుగా 'ప్రశిక్షణ వర్గ' శిక్షణ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆయుధాలతో శిక్షణ గురించి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు.
సాయిశంకర పాఠశాల అధ్యక్షులు జరు గణపతి మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో గత 10 సంవత్సరాలుగా ప్రశిక్షణ వర్గ శిక్షణ తరగతులకు వినియోగిస్తున్నామన్నారు. ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇవ్వడం గురించి తన దగ్గర సమాచారం లేదన్నారు. పాఠశాల విద్యార్థులకు సెలవు కావడంతో శిక్షణ నిర్వహణకు నిర్వాహకులకు స్థలం ఇచ్చారు. నిర్వాహకులు శిక్షణ తరగతులలో పాల్గొనే వారికి భోజనం, బస తదితర ఏర్పాట్లు చేశారు. అందులో పాఠశాల పాత్ర ఏమీ లేదు. కొన్నేళ్ల క్రితం పాఠశాలలో జాతీయ స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు'' అని తెలిపారు.
ఆయుధాలతో శిక్షణ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.
క్లెయిమ్: భజరంగ్ దళ్ కార్యకర్తలకు ఆయుధాలతో శిక్షణ ఇచ్చారంటూ వస్తున్న వార్తలు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, రాజకీయ నాయకులు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Bajrang Dal activists undergoing training holding air guns.
Claimed By : Social Media Users
Fact Check : False