ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో భేటీ అయ్యారంటూ వెలువడిన దిశా ఈపేపర్ కథనం ఫేక్
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలపై 2023 సెప్టెంబర్‌లో అరెస్టు అయ్యి...
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలపై 2023 సెప్టెంబర్‌లో అరెస్టు అయ్యి.. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆపై కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ పొందగలిగారు. బెయిల్ తర్వాత రేవంత్‌రెడ్డి వంటి నేతలు ఆయనను అర్ధరాత్రి కలిశారని వార్తలు వచ్చాయి.
‘రేవంత్ రెడ్డి అర్ధరాత్రి చంద్రబాబు నాయుడును కలిశారని, తెలంగాణలో టీడీపీ విలీనంపై వారు చర్చించుకున్నారని’ దిశా పత్రిక నుంచి వచ్చిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి భేటీపై దిశా దినపత్రిక కథనాన్ని ప్రచురించిందన్న వాదన అవాస్తవం. వార్తకు సంబంధించిన క్లిప్పింగ్ ఫేక్.అర్ధరాత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని కలిశారనే వార్తల కోసం వెతికితే ఆ వార్తను ధృవీకరించే ప్రామాణికమైన ఎటువంటి వార్త కూడా కనిపించలేదు. ఆ వార్తా క్లిప్పింగ్ ఫేక్ అని దిశా దినపత్రిక యాజమాన్యం ప్రకటించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కనుగొన్నాము.
గత కొన్ని రోజులుగా మేము దిశా ఈపేపర్ ను వెతికినా ఈ కథనం ప్రచురించలేదని మేము గుర్తించాం.
మేము వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, దాని పైన ఉన్న కథనం చివరి లైన్స్ ను చూడగలిగాము. నవంబర్ 15, 2023న ప్రచురితమైన ఈ-పేపర్‌ని వెతికితే, ‘కేసీఆర్ పరేషాన్’ శీర్షికతో ఉన్న కథనాన్ని, వైరల్ కథనంలోని లైన్‌లతో చివరి పంక్తులు సరిపోలినట్లు మేము కనుగొన్నాము. అయితే, ఈపేపర్‌లో, ‘కేసీఆర్ పరేషాన్’ క్రింద ఉన్న కథనం వైరల్ ఇమేజ్‌లో మార్చేశారని మేము గుర్తించాం.
మేము వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, దాని పైన ఉన్న కథనం చివరి లైన్స్ ను చూడగలిగాము. నవంబర్ 15, 2023న ప్రచురితమైన ఈ-పేపర్‌ని వెతికితే, ‘కేసీఆర్ పరేషాన్’ శీర్షికతో ఉన్న కథనాన్ని, వైరల్ కథనంలోని లైన్‌లతో చివరి పంక్తులు సరిపోలినట్లు మేము కనుగొన్నాము. అయితే, ఈపేపర్‌లో, ‘కేసీఆర్ పరేషాన్’ క్రింద ఉన్న కథనం వైరల్ ఇమేజ్‌లో మార్చేశారని మేము గుర్తించాం.
తమ వార్తాపత్రికలో వైరల్ కథనాన్ని ప్రచురించలేదని దిశా డైలీ కూడా తన వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.
‘దిశ’కు ఉన్న ప్రజాదరణ, ప్రచురించే వార్తలకు ఉన్న విశ్వసనీయతను అనుకూలంగా మల్చుకోడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ శక్తులు క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నాయి. పై వార్తను ‘దిశ’ పత్రిక ఇప్పటివరకు ప్రతిరోజూ ఉదయం వచ్చే రెగ్యులర్ ఎడిషన్‌లోగానీ, రోజుకు మూడుసార్లు వచ్చే డైనమిక్ ఎడిషన్లలోగానీ ప్రచురించలేదు. పత్రిక పేరును వాడుకుని ప్రజలను గందరగోళ పరిచే ఉద్దేశంతో మార్ఫింగ్ చేసిన ఈ క్లిప్పింగ్‌ను వాడుకుంటున్నాయి. అంటూ దిశ పత్రిక వివరణలో ఉంది.
‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య అర్థరాత్రి భేటీ’ అంటూ వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ ఫేక్.
Claim : The screenshot shows an article published by Disha newspaper about the midnight meeting between TDP Chief Chandrababu Naidu and TPCC President Revanth Reddy
Claimed By : Facebook Users
Fact Check : False