నిజ నిర్ధారణ: క్వీన్ ఎలిజబెత్ ఈఈ పై డిస్నీ సినిమాని ప్రకటించలేదు
క్వీన్ ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ చక్రవర్తి. సెప్టెంబరు 2022న మరణించే వరకు 70 సంవత్సరాలకు పైగా పాలించింది, బ్రిటిష్ చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తిగా నిలిచింది
క్వీన్ ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ చక్రవర్తి. సెప్టెంబరు 2022న మరణించే వరకు 70 సంవత్సరాలకు పైగా పాలించింది, బ్రిటిష్ చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తిగా నిలిచింది.
క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిస్నీ ఎలిజబెత్ II గురించి కొత్త చలనచిత్రాన్ని ప్రకటించిందని పేర్కొంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఒక చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
"క్వీన్ ఎలిజబెత్ II గురించి డిస్నీ చలనచిత్రాన్ని ప్రకటించింది" అనే వాదనతో ఒక నల్లజాతి మహిళ చిత్రం వైరల్‌గా షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
క్వీన్ ఎలిజబెత్ II సినిమా తీస్తున్నట్టు డిస్నీ ప్రకటించిందనే వాదన అవాస్తవం. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, ఈ చిత్రం 1536లో శిరచ్ఛేదం చేయబడిన హెన్రీ వీఈఈ రెండవ భార్య చివరి రోజులను వివరించే మూడు-భాగాల బ్రిటీష్ సైకలాజికల్ థ్రిల్లర్ మినిసిరీస్ 'అన్నే బోలీన్' అనే టివి సిరీస్ నుండి తీసుకోబడింది అని తెలుస్తోంది. ఈ టీవీ సిరీస్ 2021లో విడుదలైంది.
https://www.imdb.com/title/
డిస్నీ వెబ్‌సైట్‌లో వెతికినా, ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
రాబోయే సినిమాల ట్రైలర్‌లను చూపించే డిస్నీ యూట్యూబ్ ఛానెల్ తాజా ట్రైలర్ 'ది లిటిల్ మెర్మైడ్' అని చూపిస్తుంది, ఇది మే 26, 2023న థియేటర్‌లలో విడుదల కానుంది.
సెప్టెంబర్ 10, 2022న జరిగిన డి23 ఎక్స్‌పో2022లో విష్ అనే పేరుతో ఒక చలన చిత్ర ప్రకటన చేసింది డిస్నీ. ఇది యానిమేటెడ్ ఫీచర్, డిస్నీ శతజయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని 2023లో విడుదల కానుంది.
అందువల్ల, డిస్నీ క్వీన్ ఎలిజబెత్ II చలన చిత్రాన్ని ప్రకటించినట్లు అబద్దపు వాదనను పంచుకోవడానికి వినియోగదారులు టీవీ సిరీస్‌కు చెందిన చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వాదన అవాస్తవం, ప్రస్తుతానికి అలాంటి ప్రకటన ఏదీ విడుదల కాలేదు.