మహా కుంభమేళాలో భాగంగా జనవరి 23, 2025 నాటికి 10 కోట్ల మందికి పైగా భక్తులు, సందర్శకులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి వెళ్లారు. మొత్తం 45 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో స్నానం చేసే అవకాశాలు ఉన్నాయని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. యాత్రికుల రద్దీకి అనుగుణంగా, అధికారులు 150000 టెంట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు, మెరుగైన రవాణా సేవలతో తాత్కాలిక నగరాన్ని ఏర్పాటు చేశారు. 40,000 మందికి పైగా పోలీసు అధికారులను ఏఐ-శక్తితో కూడిన నిఘా వ్యవస్థలతో ఆ ప్రాంతంలో మోహరించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ జనవరి 24 సాయంత్రం డ్రోన్ ప్రదర్శనను నిర్వహించింది. ఈ డ్రోన్ షో జనవరి 24 నుండి 26, 2025 వరకు 3 రోజుల పాటు షెడ్యూల్ చేశారు. ఈ ప్రదర్శనలో, సనాతన సంప్రదాయానికి సంబంధించిన వారసత్వాన్ని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా ప్రదర్శించనున్నారు. శంఖం ఊదుతున్న సాధువు, సంగంలోని పవిత్ర జలాల్లో మునిగిపోయిన సాధువు చిత్రాలు లాంటివి ఆధ్యాత్మికతను జోడించాయి. విధానసభ భవన్‌పై భారతదేశ త్రివర్ణ పతాకం లాంటివి ప్రేక్షకులలో దేశభక్తికి పెంపొందించడానికి కారణమయ్యాయి.
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ప్రదర్శించిన డ్రోన్ ప్రదర్శన అని పేర్కొంటూ వేలాది డ్రోన్‌లు ఆకాశంలో అద్భుతమైన చిత్రాలను సృష్టించినట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో, వ్యక్తులు డ్రోన్‌లను విశాలమైన ప్రదేశంలో అమర్చడం ఆ తర్వాత డ్రోన్ ద్వారా ప్రదర్శించే చిత్రాలను మనం చూడవచ్చు. ఈ డ్రోన్ షోలో రెయిన్ డీర్, శాంతా క్లాజ్ మొదలైన చిత్రాలను మనం చూడవచ్చు.
“प्रयागराज महाकुंभ तारों का शहर…” అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో నవంబర్ 26, 2024 న రికార్డు చేశారు. USAలోని టెక్సాస్ కు సంబంధించిన వీడియో ఇది.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అదే వీడియోని ‘5000 drones, technology is awesome’ అనే టైటిల్ తో ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. అందులో శాంటాక్లాజ్, రెయిన్ డీర్ భారీ చిత్రాలు కనిపించాయి.
‘5000 drones + Santa Claus’ దీన్ని క్యూగా తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా డిసెంబర్ 2024న పలు మీడియా కథనాలు మాకు కనిపించాయి. Sky Elements Drone Shows అనే యూట్యూబ్ ఛానల్ లో డిసెంబర్ 6, 2024న ‘5000 drone Santa’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.
స్కై ఎలిమెంట్స్ డ్రోన్ అనే సంస్థ ప్రచురించిన వీడియోను షేర్ చేస్తూ
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఈ వీడియోలో 5000 డ్రోన్‌లు భారీ శాంతా క్లాజ్ ఆకారంలో ఆకాశంలో అద్భుతం సృష్టిస్తుందని పేర్కొంది. వీడియో డల్లాస్‌లో డ్రోన్‌లను అవుట్‌డోర్‌లో ఏర్పాటు చేస్తున్నప్పుడు సాంకేతిక నిపుణుల సృష్టిని చూడొచ్చు. అద్భుతమైన చిత్రాలను ఆకాశంలో వీక్షించడానికి వీలైందని తెలిపారు.
NDTVలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. US- ఆధారిత డ్రోన్ కంపెనీ క్రిస్మస్ ముందు టెక్సాస్‌లోని మాన్స్‌ఫీల్డ్‌లోని ఒక ఫీల్డ్‌పై 5000 UAVలను ఎగురవేయడం ద్వారా అతిపెద్ద డ్రోన్ షోకు వేదికగా నిలిచింది. ఆ బృందం వీడియోను పోస్ట్ చేసింది.
స్కై ఎలిమెంట్స్ అనే సంస్థ ఉత్తర అర్ధగోళంలో 2500 డ్రోన్‌లను ఎగరేయగా, ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించింది.
హిందూస్తాన్ టైమ్స్ కూడా ఒక కథనాన్ని షేర్ చేసింది, ‘ఖచ్చితత్వం, సమన్వయంతో, డ్రోన్‌లు గాల్లోకి ఎగిరి, ప్రేక్షకులను అబ్బురపరిచే భారీ, ప్రకాశవంతమైన చిత్రాలను తయారు చేసాయి. శాంటా కనపడగానే కనిపించిన క్షణం, జనం చప్పట్లతో మార్మోగారు.’
అందువల్ల, డ్రోన్ షోకు సంబంధించిన వైరల్ వీడియో మహాకుంభమేళా సమయంలో తీయలేదు, వీడియో USA లోని టెక్సాస్ లో రికార్డు చేశారు. నవంబర్ 26, 2024న చోటు చేసుకున్న ఘటన ఇది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.