ఫ్యాక్ట్ చెక్: జీ20 సదస్సు సమయంలో ప్రధాని మోదీ పాపులారిటీకి సంబంధించిన హోర్డింగ్ ను ఏర్పాటు చేయలేదు
G20 సమ్మిట్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఉన్న ప్రజాదరణకు సంబంధించిన హోర్డింగ్ ను ప్రదర్శించారు.
'మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్' గా బిరుదు పొందినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్న హోర్డింగ్ కు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
ఈ హోర్డింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ శాతంతో పాటు.. మోదీ కంటే తక్కువ పాపులారిటీ ఉన్న మరో ఆరుగురు ప్రముఖ నాయకులు ఉన్నారు.
సెప్టెంబరులో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలో ఈ హోర్డింగ్ లని ఏర్పాటు చేశారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇలా సెల్ఫ్ ప్రమోషనల్ పీఆర్ స్ట్రాటజీలో పాల్గొందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా సెప్టెంబర్ 6, 2023న ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. G20 సమ్మిట్‌కు ముందు ప్రధాని మోదీలో ఢిల్లీలో చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను అందించారు. ఏప్రిల్ 6, 2023న ఢిల్లీలో తీసిన చిత్రం అని క్యాప్షన్ పేర్కొందిG20 సమ్మిట్ కంటే చాలా ముందుగానే ఈ హోర్డింగ్ ను ఇన్‌స్టాల్ చేశారని.. జీ20 సమ్మిట్ తో ఎటువంటి సంబంధం లేదని ఫోటో డేట్‌లైన్ స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా, G20 సమ్మిట్‌కు సంబంధించిన ఏదైనా కంటెంట్, హోర్డింగ్ దాని లోగోను కలిగి ఉంటుంది. వైరల్ ఇమేజ్‌లో ఆ లోగో లేదు, హోర్డింగ్ కు జీ20 సమ్మిట్‌కి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు విజయ్ గోయెల్ కూడా ఈ క్లెయిమ్ ఫేక్ న్యూస్ అని, ఢిల్లీలో అలాంటి హోర్డింగ్ ఏదీ ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ X (గతంలో ట్విట్టర్)లో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఇండియా టుడే, బిజినెస్ టుడే నివేదికల ప్రకారం.. జనవరి 2022లో నరేంద్ర మోదీని 'అత్యంత ప్రజాదరణ పొందిన' గ్లోబల్ లీడర్‌గా పేర్కొన్న తర్వాత ఈ చిత్రాన్ని హోర్డింగ్‌గా మార్చారు. మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వంటి ప్రపంచ నాయకులను మోదీ అధిగమించారు. ఈ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసింది.
G20 సమ్మిట్‌కు సమయంలో ప్రధాని మోదీకి సంబంధించిన అలాంటి పోస్టర్ ను ఏర్పాటు చేయలేదు. నెటిజన్‌లను తప్పుదారి పట్టించేందుకు పాత చిత్రాన్ని తప్పుగా షేర్ చేస్తున్నారు.
Claim : Hoarding of Prime Minister Narendra Modi claiming about his popularity, ahead of the G20 Summit.
Claimed By : Social media
Fact Check : Misleading