ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు మద్దతిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ కు ఓటు వేయమని మాత్రమే కోరారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతు తెలిపారు

Update: 2024-06-03 08:58 GMT

ఇంకొన్ని గంటల్లో 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన తప్పుడు కథనాలను జనం నమ్మేసి షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

రాహుల్‌ గాంధీ ప్రజలను బీజేపీకి ఓటు వేయమని కోరుతూ 30 సెకన్ల నిడివి గల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు దానిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్‌ వీడియోలో చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారనే వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి పోస్ట్ లేదా టైమ్‌లైన్‌లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. “రాహుల్ గాంధీ నుండి చాలా ముఖ్యమైన & చివరి అప్పీల్ సందేశం” అనే వాదనతో వీడియోను షేర్ చేశారు.


Full View


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వీడియోను ఎడిట్ చేశారని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలుస్తోంది. అసలు వీడియోలో రాహుల్ గాంధీ బీజేపీని విమర్శించారని మేము గుర్తించాం.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము 25 ఏప్రిల్ 2024న రాహుల్ గాంధీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో అదే వీడియోను షేర్ చేసారు.

“संविधान और लोकतंत्र की रक्षा के इस चुनाव में, 'मित्र काल' से निकल कर 'हिंदुस्तानियों की सरकार' बनाने के चुनाव में... लोकतंत्र का अपना कर्तव्य निभाइए, कांग्रेस के साथ आइए, हाथ का बटन दबाइए ! जय हिंद” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను రాహుల్ గాంధీ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని.. హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు.


https://www.facebook.com/reel/1013195190399746



ఈ వీడియోలో.. రాహుల్ “నమస్కారం, నేను రాహుల్ గాంధీ. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, సిద్ధాంతాలను కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు. ఒకవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ, I.N.D.I.A. కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మేము కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్లు కాలినడకన నడిచాము. మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు కూడా నడిచాము. మేము మిమ్మల్ని సంప్రదించాము, మీరు చెప్పేది కూడా విన్నాము, ఆపై ఒక విప్లవాత్మక మేనిఫెస్టోను రూపొందించాము." అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున ఐదు కీలకమైన హామీలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను చూడాలని.. దయచేసి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండని రాహుల్ గాంధీ ఆ వీడియోలో కోరారు.
ది ఎకనామిక్ టైమ్స్ దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా ప్రచురించింది, "భారతీయుల ప్రభుత్వం ఏర్పాటుకు 'హస్తం' గుర్తుకు ఓటు వేయాలని రాహుల్ గాంధీ కోరారు" అంటూ ఆ కథనంలో ఉంది.
అందువల్ల, వైరల్ వీడియోను ఎడిట్ చేశారని.. తప్పుడు వాదనతో వైరల్ చేశారని స్పష్టమైంది.
అసలు వీడియోలో, రాహుల్ గాంధీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.


Claim :  రాహుల్ గాంధీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతు తెలిపారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News