ఫ్యాక్ట్ చెక్: రాకింగ్ రాకేష్ తన సినిమాకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ డబ్బులు పెట్టారని ఎక్కడా చెప్పలేదు

రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కే.సీ.ఆర్. అనే టైటిల్ ఉన్న సినిమాకు;

Update: 2024-11-30 18:20 GMT


జబర్దస్త్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి రచయిత, నిర్మాత కూడా రాకేష్ వ్యవహరించారు. ఒక గ్రామంలో కలిసి పెరిగిన ఇద్దరు చిన్ననాటి స్నేహితుల చుట్టూ, బలమైన బంధంతో కేసీఆర్ కథ తిరుగుతుంది. అయితే, పెళ్లి ప్రస్తావనకు వచ్చినప్పుడు, యువకుడు తన స్నేహితురాలిని (అన్నన్య కృష్ణ పోషించాడు) వివాహం చేసుకోకూడదని అనుకుంటాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నగరానికి వెళతాడు. హైదరాబాద్‌లో అనేక కష్టాలు ఎదురవుతాయి. వాటిని దాటాడా లేదా అన్నది సినిమాలో అసలు కథ. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి ఈ చిత్రానికి దర్శకుడు. చరణ్ అర్జున్ సంగీత దర్శకుడు. మధు ఎడిటర్ గా వ్యవహరించారు.
నిర్మాత అయినందున, రాకేష్ ఈ చిత్రాన్ని తన శక్తి మేరకు పూర్తి స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి హరీష్ రావు, అనసూయ, జానీ మాస్టర్, రోజా, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చాడు. ప్రముఖ నటి సత్య కృష్ణన్ కుమార్తె అన్నన్య కృష్ణన్ ఇందులో కథానాయికగా నటించింది. నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా.
ఈ సినిమాకు సంబంధించిన ఓ పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"అసెంబ్లీ కి రావడానికి కుదరదు… తన మీద సినిమా తీయించుకోవడానికి రోజు 5 గంటలు ఈ జూనియర్ ఆర్టిస్ట్ తో కూర్చుంటాడు…
వరదలు విపత్తులు వొచ్చిన ఒక్క రూపాయి పేదోళ్లకి ఇయ్యడు
అయ్యగారి సినిమాకి 20 కోట్లు ఖర్చు పెడతాడు
ఏం బతుకులు రా మీవి…" అనే కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో న్యూస్ ఆర్టికల్ లాంటి ఫోటోను షేర్ చేశారు.
తన కోసం సినిమా తీయమని కేసీఆరే డబ్బులు ఇచ్చారు
> సినిమాలు తీసే స్థాయి నాది కాదంటే ఫాంహౌస్కు పిలిపించి 20 కోట్లు ఇప్పించారు
మీడియాతో కేశవ్ చంద్ర రమావత్ (KCR) సినిమా నిర్మాత, కమెడియన్ రాకింగ్ రాకేష్ " అని అందులో ఉంది.







వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.




 



ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, హీరో రాకింగ్ రాకేష్ స్వయంగా ధృవీకరించారు.
వార్తాపత్రిక క్లిప్పింగ్ దిగువన ‘తెలంగాణ న్యూస్ టుడే’ పేరుతో లోగో ఉంది. దాని పేపర్‌కి లింక్ కూడా ఉంది. అయితే, అటువంటి వార్తాపత్రిక లేదా వెబ్‌సైట్ మాకు కనిపించలేదు. లింక్ ఓపెన్ చేస్తుంటే ఏ తెలుగు వెబ్ సైట్ కూడా మాకు కనిపించలేదు. ఆ పేరుతో తెలంగాణలోని ఏ వార్తాపత్రిక కూడా లేదు.
అలాగే వైరల్ క్లిప్పింగ్ కింద గుడ్లగూబ చిత్రాన్ని గమనించాము. ఇది రీడ్‌వేర్ వెబ్‌సైట్ లోగో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను ప్రచురించవచ్చు. అలా నకిలీ వార్తాపత్రిక క్లిప్పింగ్ రూపకల్పన జరిగింది.
ఇక వైరల్ ఫోటోలో రాకింగ్ రాకేష్ కేసీఆర్ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో వేసుకున్న డ్రెస్ అని మేము గుర్తించాం. ఆయన స్పీచ్ కు సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. అందులో ఎక్కడా కూడా సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు అని చెప్పలేదు.

Full View


ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన రాకేష్ స్పీచ్ ను కూడా మేము చూశాం. ఎక్కడా కూడా కేసీఆర్ డబ్బులు పెట్టారని వ్యాఖ్యలు చేయలేదు.
Full View



ఇక మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఇన్స్టాగ్రామ్ లో రాకింగ్ రాకేష్ ఇంటికి కొందరు వెళ్లి ఐటీ రైడ్స్ అంటూ హల్చల్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయని గుర్తించాం.
ట్యాగ్ తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసిన వీడియోలో స్వయంగా రాకింగ్ రాకేష్ వైరల్ పోస్టుపై స్పందిస్తూ, ఈ సినిమాకు కేసీఆర్ ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు.








నిడివి ఎక్కువ ఉన్న వీడియోను యూట్యూబ్ లో మేము గమనించాం.

Full View

ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమని ఈ వీడియోను చివరిదాకా చూస్తే తేలింది.
వైరల్ పోస్టులు నిజం కాదంటూ పలు మీడియా సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్ చేశాయి. ఆ కథనాలు ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, రాకింగ్ రాకేష్ తీసిన సినిమాకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆర్ధిక సాయం చేయలేదని గుర్తించాం.

వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.


Claim :  రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కే.సీ.ఆర్. అనే టైటిల్ ఉన్న సినిమాకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ డబ్బులు పెట్టారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News