ఫ్యాక్ట్ చెక్: ఖలిస్తానీలు ఢిల్లీలో ఆలయాన్ని ధ్వంసం చేశారంటూ వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

పంజాబ్ ముఖ్యమంత్రి ఏప్రిల్ 29న తన అధికారిక X ఖాతాలో ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను మేము కనుగొన్నాము;

Update: 2024-02-23 12:57 GMT

2022లో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన మూడు రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో రైతులు వీధుల్లోకి వచ్చి ‘డిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. మార్చ్‌కు ముందు, రైతులు నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో సిమెంట్ దిమ్మలు, ముళ్ల తీగలను ఉంచారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు కూడా ప్రయోగించారు.


ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులు గుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ రైతుల ముసుగులో ఖలిస్థానీలు ప్రవేశించారని.. హిందూ దేవాలయం, ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలపై దాడి చేశారనే వాదనతో షేర్ చేస్తున్నారు. So-called farmers "Khalistanis" have attacked a Hindu temple and shops around the temple. Is this really a protest for farmers or the unnecessary rage against Hindus? #FarmerProtest2024 #shame #UPPoliceexam #breaking అంటూ పోస్టులు పెట్టారు.


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ వీడియో ఢిల్లీకి చెందినది కాదు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు.
మేము వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేశాం. ఏప్రిల్ 30, 2022న ఉదయ్ బరద్ షేర్ అనే జర్నలిస్ట్ అకౌంట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మేము చూశాం. ఉదయ్ బరద్ షేర్ చేసిన పోస్ట్ లో వివిధ కోణాలకు సంబంధించిన విజువల్స్ ను మేము గుర్తించాం. “ఖలిస్తానీ మద్దతుదారులు కాళీ దేవాలయంపై దాడి చేసిన తర్వాత హిందూ సంఘాలు పాటియాలా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఖలిస్తానీలపై FIR నమోదు చేశారు" అనే వాదనతో ఫోటోను పోస్టు చేశారు.
Full View

మేము ఇంటర్నెట్‌లో 'పాటియాలా బంద్' గురించి సెర్చ్ చేశాం.. ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) వారి X ఖాతాలో ఏప్రిల్ 29, 2022న 56-సెకన్ల విజువల్‌స్ ని షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. పంజాబ్ లోని పాటియాలాలోని కాళీదేవి మందిర్ సమీపంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో మోహరించి ఉండడం ఆ వీడియోలో మనం గమనించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ఏప్రిల్ 29న తన అధికారిక X ఖాతాలో ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను మేము కనుగొన్నాము. “పాటియాలాలో జరిగిన ఘర్షణల సంఘటన చాలా దురదృష్టకరం. డీజీపీతో మాట్లాడి శాంతిభద్రతలు నెలకొల్పాము. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము, రాష్ట్రంలో ఎవరూ అల్లకల్లోలం సృష్టించేలా చేయనివ్వం. పంజాబ్ శాంతి, సామరస్యం అత్యంత ముఖ్యమైనది" అని ఆయన తెలిపారు.


హిందూస్తాన్ టైమ్స్ ఇందుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది. “శివసేన (బాల్ థాకరే) వర్గం నిర్వహించిన ఖలిస్తాన్ ముర్దాబాద్ మార్చ్‌ను వ్యతిరేకిస్తూ రాడికల్ సిక్కు మూకలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి." అని ఆ కథనంలో ఉంది.
'పాటియాలా ఘర్షణలు: ఖలిస్థాన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. రెండు గ్రూపుల మధ్య హింస చెలరేగింది.' అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో కథనాలు ఉన్నాయి.
ఈ వీడియో ఢిల్లీకి చెందినది కాదని ధృవీకరించాం. రైతుల నిరసనలకు ఈ సంఘటనకు ఎటువంటి సంబంధం లేదు. పంజాబ్‌లోని పాటియాలాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఇది.


Claim :  Farmers destroy temple during ongoing protest in Delhi
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News