ఫ్యాక్ట్ చెక్: సినిమాలోని యాక్షన్ సీన్లను తలపించేలా రోడ్లపై కార్లతో భీభత్సం సృష్టించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకోలేదు. మెక్సికోలో జరిగిన ఘటన ఇది.
ఒక కారుతో మరొక కారుని ఢీకొట్టడం.. మనుషుల మీదకు కార్లతో వెళ్లడం
ఒక కారుతో మరొక కారుని ఢీకొట్టడం.. మనుషుల మీదకు కార్లతో వెళ్లడం లాంటి ఘటనను కొందరు తమ కెమెరాలలో చిత్రీకరించారు.
భారత రాజధాని నగరం న్యూ ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఓ వ్యక్తిని ఓ కారు ద్వారా పదే పదే ఢీకొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో కారు ఇష్టమొచ్చినట్లు రోడ్డు మీద దూసుకుని వెళ్లడం కూడా మనం గమనించవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము వైరల్ వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అదే వీడియోని కలిగి ఉన్న రెడ్డిట్ పోస్ట్‌ను కూడా కనుగొన్నాము. కామెంట్స్ విభాగంలో ఈ సంఘటనకు సంబంధించిన వార్తా నివేదిక ఉంది.
స్పానిష్ మీడియా నివేదిక ప్రకారం.. డిసెంబర్ 3, 2022న మెక్సికోలోని Avenida Tecnol³gicoలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. ఘర్షణ కారణంగా ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొక వ్యక్తి మీద కారుతో రెండుసార్లు దూసుకుని వచ్చాడు. ఈ ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
అదే సంఘటనను కవర్ చేసిన అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, వార్తా కథనాలను కూడా మేము కనుగొన్నాము. ఈ మూలాధారాల ప్రకారం, టోలుకాలోని అవెనిడా టెక్నాల్‌గికోలో ఉన్న మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ ముందు ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనపై ఇతర నివేదికల్లో దెబ్బతిన్న వాహనాల చిత్రాలు, రోడ్ రేజ్ ఎపిసోడ్‌లో నిమగ్నమైన వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి.
మెక్సికో భద్రతా కార్యదర్శి డిసెంబర్ 4, 2022న ట్విటర్‌లో ఈ సంఘటనకు కారణమైన వ్యక్తిని అధికారులు పట్టుకున్నారని ప్రకటించారు.
అందువల్ల, మెక్సికోలోని టోలుకాలో జరిగిన రోడ్ రేజ్ సంఘటనను చూపించే వీడియోను ఢిల్లీలో చోటు చేసుకున్న సంఘటనగా తప్పుగా ప్రచారం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
Claim : The viral video shows a road rage incident in Delhi
Claimed By : Social media users
Fact Check : False