ఫ్యాక్ట్ చెక్: కమలా హ్యారిస్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఫోటోలు దిగలేదు.. వాటిని డిజిటల్‌గా ఎడిట్ చేశారు
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి;
కమలా దేవి హారిస్ అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు. యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను 2021 జనవరి 20న చేపట్టారు. 2024లో కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. డొనాల్డ్ ట్రంప్ మీద ఆమె పోటీ చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ కమలా హ్యారిస్ రంగు, ఏ దేశానికి చెందిన వారో చెప్పాలంటూ టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఆమె కుటుంబాన్ని చూపిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. చికాగోలో జరిగిన నల్లజాతి జర్నలిస్టుల కార్యక్రమంలో ట్రంప్ హారిస్ భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా.. అని ప్రశ్నించారు.
ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ జాతి, రంగు కేంద్ర బిందువుగా మారింది.
ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. చిత్రంలో ఫెడరల్ సెక్స్-ట్రాఫికింగ్ ఆరోపణల్లో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో హారిస్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వినియోగదారులు వివిధ వాదన లతో షేర్ చేశారు.
క్లెయిమ్ 1
“BREAKING: Federal judge orders more than 150 names linked to Jeffrey Epstein unsealed. One of those names, Kamala Harris” అనే క్యాప్షన్ తో ఓ యూజర్ పోస్టు పెట్టారు. ఫెడరల్ జడ్జి జెఫ్రీ ఎప్స్టీన్‌తో సంబంధం ఉన్న 150 కంటే ఎక్కువ పేర్లను బయట పెట్టమని ఆదేశించారు. అందులో ఒకటి కమలా హారిస్ పేరు అని ఆ పోస్టుల్లో ఉన్నాయి.

క్లెయిమ్ 2:
కమలా హారిస్, జెఫ్రీ ఎప్స్టీన్ ఇద్దరూ కలిసి స్విమ్‌సూట్‌లు ధరించి ఫోటో కోసం పోజులిచ్చిన ఫోటోను మరొక యూజర్ షేర్ చేసారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. మొదటి చిత్రం డిజిటల్‌గా ఎడిట్ చేశారు. రెండవది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు.
క్లెయిమ్ 1 ఫ్యాక్ట్ చెకింగ్:
మేము మా పరిశోధనలో కమలా హారిస్ తన భర్తతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన వినియోగదారుని మేము కనుగొన్నాము. కమలా హారిస్ లేదా జో బిడెన్‌లు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఎప్పుడూ ఫోటోలు దిగలేదు. మీరు చూసే ఫోటోలు దాదాపుగా నకిలీవే అయి ఉంటాయి అంటూ వివరించారు.
మీరు అసలు చిత్రాలను గమనించి.. వైరల్‌తో పోల్చినట్లయితే, కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్ తల భాగం ఎడిట్ చేశారని గమనించవచ్చు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ సమయంలో.. గెట్టి ఇమేజ్‌లలో అప్‌లోడ్ చేసిన కమలా, డగ్లస్ చిత్రాలని మేము కనుగొన్నాము. ఈ చిత్రాలు సెప్టెంబర్ 17, 2015న లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్‌లో బ్రాడ్ మ్యూజియం బ్లాక్ టై ప్రారంభ విందుకు డగ్లస్ ఎమ్‌హాఫ్, కమలా హారిస్ హాజరైనప్పుడు తీసినవి.
వైరల్ ఇమేజ్ డిజిటల్‌గా ఎడిట్ చేశారని ఇది రుజువు చేస్తుంది. అసలు ఫోటోలలో, కమలా హారిస్ తన భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్‌తో కలిసి కనిపించారు.
క్లెయిమ్ 2 ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ చిత్రం చాలా అసహజంగా కనిపించడంతో, మేము దానిని AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి పరీక్షించాము. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రూపొందించారని స్పష్టంగా తేలింది. ఈ చిత్రం 99.53% AI ద్వారా రూపొందించిందేనని ఫలితాలు చూపించాయి.
దీన్ని బట్టి వైరల్ చిత్రం ఒరిజినల్ కాదని రుజువు చేస్తుంది. ఇది 99.53% ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినదేనని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ ఫోటోలను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. కమలా హారిస్ తన భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్‌తో కలిసి దిగిన చిత్రాన్ని ఎడిట్ చేశారు. ఇంకో చిత్రాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.
Claim : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు
Claimed By : social media users
Fact Check : False