ఫ్యాక్ట్ చెక్: కల్తీ పాల కారణంగా 2025 నాటికి 87% మంది భారతీయులు క్యాన్సర్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే వాదనను WHO, భారత ప్రభుత్వం ఖండించాయి.

కల్తీ పాల కారణంగా 2025 నాటికి 87% మంది భారతీయులు క్యాన్సర్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే వాదనలను ప్రపంచ

Update: 2024-02-23 17:59 GMT

టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 2017లో ఆయనకు మొదటిసారి బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత 2022లో మరోసారి బాధ్యతలను అప్పగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ప్రబలిస్తున్న సమయంలో ఆయన పలు కీలక సూచనలను అందించారు.

ఇక కల్తీ పాలను తీసుకోవడం వల్ల 2025 నాటికి భారతదేశంలోని 87% జనాభా క్యాన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది.
"87 శాతం భారతీయులకు క్యాన్సర్!
2025 నాటికి 87 శాతం మంది భారతీయులు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన సూచనలో, భారతీయ మార్కెట్లలో అమ్ముతున్న పాలు కల్తీ అని.. ఈ పాలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ కల్తీని నియంత్రించకపోతే, భారతదేశంలోని అధిక జనాభా క్యాన్సర్ కు గురవుతయారు. భారతదేశంలో విక్రయించే పాలలో 68.7 శాతం కల్తీ అవుతూ ఉంది" అనేది వైరల్ మెసేజీలోని సారాంశం.
భారత దేశంలో విక్రయించే 68.7 శాతం పాలు లేదా పాల ఉత్పత్తులలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలు పాటించడం లేదని జంతు సంక్షేమ బోర్డు సభ్యులు ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఈ వైరల్ పోస్ట్ లో ఉంది.
తెలుగు, హిందీ భాషల్లో ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది.

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
ఈ వైరల్ పోస్టును ఖండిస్తూ.. WHO విడుదల చేసిన ప్రెస్ నోట్‌ని మేము కనుగొన్నాము. ప్రెస్ నోట్‌లో.. భారతదేశంలో కల్తీ పాల ద్వారా క్యాన్సర్ వస్తుందని WHO ఎప్పుడూ హెచ్చరించలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న నివేదికలలో ఎలాంటి నిజం లేదని.. పాలు/పాల ఉత్పత్తుల కల్తీ సమస్యపై భారత ప్రభుత్వానికి ఎటువంటి సలహా ఇవ్వలేదని WHO తెలిపింది.



 


ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ వాదనపై స్పందించింది. ఒక ట్వీట్ లో భారత ప్రభుత్వానికి WHO అలాంటి హెచ్చరిక ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. నవంబర్ 22, 2019న, కల్తీ పాల వినియోగం వల్ల 87% జనాభాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని WHO ప్రభుత్వానికి సూచించిందనే పుకార్లపై
అప్పటి కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. అలాంటి సూచన ఏదీ ఇవ్వలేదని ఆయన వివరించారు. పాల కల్తీకి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ భారత ప్రభుత్వానికి ఎలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారాయన.

దేశంలో విక్రయించే 68.7% పాలు, పాల ఉత్పత్తులు FSSAI నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని మరో ప్రశ్నకు సమాధానంగా హర్షవర్ధన్ స్పందిస్తూ, "FSSAI 2018లో నిర్వహించిన నేషన్‌వైడ్ మిల్క్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సర్వేలో కేవలం 7% (మొత్తం 6,432 నమూనాలలో 456) మాత్రమే కలుషితాలయ్యాయని.. వాటిలో యాంటీబయాటిక్స్, పురుగుమందులు, అఫ్లాటాక్సిన్M1 ఉన్నాయని తేలింది. మొత్తం 6,432 నమూనాలలో 12 మాత్రమే పాల భద్రతను ప్రభావితం చేసే కల్తీలుగా గుర్తించారు. ఈ 12 నమూనాలలో హైడ్రోజన్పెరాక్సైడ్‌తో కల్తీ చేసిన 6 నమూనాలు, డిటర్జెంట్లతో కల్తీ చేసిన 3 నమూనాలు, యూరియాతో కల్తీ చేసిన 2 నమూనాలు, ఒక నమూనాలో న్యూట్రలైజర్ ఉన్నట్లు కనుగొన్నారు" అని ఆయన వివరించారు.


 

2021-22 ఆర్థిక సర్వే ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం పాల ఉత్పత్తి 209.96 మిలియన్ టన్నులు. 2021-22లో దేశంలో మొత్తం 18,460.67 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది. కాబట్టి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతిరోజూ 50.58 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి చేశారు.
అనేక మీడియా సంస్థలు కూడా 2023లో వైరల్ వాదనను ఖండించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ తప్పుడు సమాచారం ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందకుండా.. WHO, భారత ప్రభుత్వం రెండూ వివరణలు ఇచ్చాయి.


Claim :  World Health Organization (WHO) has issued an advisory to the Government of India stating that 87% of the population of India will suffer from cancer by 2025 due to consumption of adulterated milk
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News