ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ‘ఆప్ కి అదాలత్’ ఇంటర్వ్యూలో టెలిప్రాంప్టర్ ను ఉపయోగించలేదు.

హైదరాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ఇటీవల రజత్ శర్మ హోస్ట్ చేసిన ‘ఆప్ కి అదాలత్’ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు.

Update: 2024-04-10 11:30 GMT

Madhavi Latha

హైదరాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ఇటీవల రజత్ శర్మ హోస్ట్ చేసిన ‘ఆప్ కి అదాలత్’ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు. ఈ షోలో గతంలో వివిధ సెలబ్రిటీలు పాల్గొన్నారు. హోస్ట్ రజత్ శర్మ ఎన్నో సంచలన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తదితర ప్రముఖులు ఈ షోలో గతంలో పాల్గొన్నారు. మాధవి లత షోలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాలు చాలా గొప్పగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

ఇంతలో.. మాధవి లత షోలో పాల్గొన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. షోలో ఆమె తన సమాధానాల కోసం టెలిప్రాంప్టర్‌ను ఉపయోగించిందని, ఆమె చేతిలో టెలిప్రాంప్టర్ రిమోట్‌ను పట్టుకుని ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రాల కోల్లెజ్ ను పోస్ట్ చేసి “టెలిప్రాంప్టర్ మంచి వక్తని చేస్తుంది” అంటూ పోస్టులు పెడుతున్నారు. బీజేపీలోని వ్యక్తులంతా మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆ పోస్టుల్లో తెలిపారు.
“#MadhaviLatha ji, Aap to apke VishwaGuru #Modi se bhi aage nikal padi” అంటూ పోస్టులు పెట్టారు.
అక్బరుద్దీన్ ఒవైసీ ఫ్యాన్ పేజీ కూడా అదే వాదనతో చిత్రాన్ని పంచుకుంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. బీజేపీ నాయకురాలు ధ్యానం కోసం ఉపయోగించే కౌంటింగ్ మెషీన్ ను పట్టుకుని ఉన్నారు. మేము Googleలో వైరల్ చిత్రం గురించి సెర్చ్ చేశాం.ఆన్‌లైన్‌లో ఇలాంటి పరికరాలను విక్రయించే కొన్ని ఇ-కామర్స్ వెబ్‌పేజీలను మేము కనుగొన్నాము.
temu.comలో
రోలర్ కౌంటర్, డిజిటల్ కౌంటర్, వేర్‌హౌస్ కౌంటర్, రింగ్-ఆకారపు కౌంటర్, హ్యాండ్‌హెల్డ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ అనే పలు పరికరాలను మేము గమనించాం. ఆ ఫోటో ఇక్కడ చూడొచ్చు.


 మేము Amazonలో కూడా ఇలాంటి పరికరాన్ని కనుగొన్నాము. జపం చేసే సమయంలో మంత్రాలను డిజిటల్ గా కౌంటింగ్ చేయవచ్చు.


 పలు ఇంటర్వ్యూలలో ఆమె ఈ డివైజ్ ను చేతుల్లో పట్టుకోడాన్ని కూడా మేము చూశాం.
Full View



 బీజేపీ నాయకురాలు మాధవి లత చేతిలో ఉన్న పరికరం టెలిప్రాంప్టర్ రిమోట్ కాదు, ధ్యానం కోసం ఉపయోగించే డిజిటల్ కౌంటింగ్ మెషీన్. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది 

Claim :  హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ‘ఆప్ కి అదాలత్’ ఇంటర్వ్యూలో టెలిప్రాంప్టర్ రిమోట్ ను పట్టుకున్నారు.
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News