ఫ్యాక్ట్ చెక్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతూ ఉంది.
లండన్‌లో జరిగిన 2023 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ ప్రకటన వైరల్‌గా మారింది.
వైరల్ స్టేట్‌మెంట్‌లో “ తాను క్రికెట్ కెరీర్ ను ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఏదో ఒక దశలో కొన్ని ఆగిపోవాలి.. భారత టెస్ట్ కెప్టెన్‌గా నేను ఇప్పుడు వీడ్కోలు పలకాలని అనుకుంటూ ఉన్నా.. ఇది సరైన పని కాదని నాకు తెలుసు. ఈ విషయం గురించి నాకు పూర్తి స్పష్టత ఉంది. మీరు ఈ ప్రయాణాన్ని చాలా చిరస్మరణీయంగా.. అందంగా చేసారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను" అంటూ అందులో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
రోహిత్ శర్మ అధికారికంగా తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రోహిత్ శర్మ నుండి అలాంటి ప్రకటన వచ్చింటే మాత్రం మీడియా, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగి ఉండేది. ఒకవేళ నిజంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే, అది మీడియా ద్వారా రిపోర్ట్ చేసి ఉండేది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం ఆన్‌లైన్‌లో లేదా వార్తాపత్రికలలో నివేదించలేదు. రోహిత్ శర్మ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా రిటైర్మెంట్ గురించి ప్రస్తావించలేదు.రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జనవరి 2022లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ షేర్ చేసిన స్టేట్‌మెంట్‌ను కనుగొన్నాం. కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా వైదొలిగినప్పుడు ఇలాంటి నోట్‌ను షేర్ చేశాడు. ఇదే నోట్‌ను జనవరి 15, 2022న కోహ్లీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేశారు.
అందులో కోహ్లి తన ప్రయాణం గురించి మాట్లాడాడు. అవకాశం ఇచ్చినందుకు BCCIకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కోచ్ రవిశాస్త్రిలు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు రోహిత్ శర్మ గురించి తప్పుడు వార్తలను పంచుకోవడానికి అదే నోట్ ఉపయోగించారు.
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఎలాంటి నివేదికలు లేవు. మరో క్రికెటర్ షేర్ చేసిన పాత పోస్టును రోహిత్ శర్మకు ఆపాదించారు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : Rohit Sharma has announced his retirement from test cricket
Claimed By : Social Media Users
Fact Check : False