ఫ్యాక్ట్ చెక్: ముగ్గురు వ్యక్తులు తమ కాళ్లకు కట్టిన బ్యాండేజ్ తో పాక్కుంటూ వెళుతున్న వీడియోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

సైకిల్ పై వెళ్తున్న ఓ బాలికను కిందపడేసి.. ఆమెను చంపినందుకు ముగ్గురు వ్యక్తుల కాళ్లలో పోలీసులు తూటాలను దింపారని, ఆసుపత్రిలో వాళ్లకు వీల్ చైర్ కూడా ఇవ్వలేదని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Update: 2023-10-05 05:23 GMT

సైకిల్ పై వెళ్తున్న ఓ బాలికను కిందపడేసి.. ఆమెను చంపినందుకు ముగ్గురు వ్యక్తుల కాళ్లలో పోలీసులు తూటాలను దింపారని, ఆసుపత్రిలో వాళ్లకు వీల్ చైర్ కూడా ఇవ్వలేదని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

“సెహబ్,,, అఫ్జల్,,, పైసల్.. ఈ ముగ్గురు ముస్లిం పోరగాండ్లు... ఉత్తరప్రదేశ్లో హిందూ బాలిక సైకిల్ పై వెళ్తుంటే చున్ని లాగి అఫ్జల్ పడేసాడు. వెనకాల మిగితా ఇద్దరు బైక్ తో అమ్మాయిని ఢీ కొట్టి పారిపోయారు... ఇది జరిగిన 24 అవర్స్ లో,, యోగి జి వాళ్ళ కాళ్లల్లో బుల్లెట్లు దింపించి... ట్రీట్మెంట్ చేపించి కనీసం వీల్ చైర్ ఇవ్వకుండా ఇలా దేగిస్తూ జైలుకు పంపారు...” అంటూ పోస్టులు పెట్టారు.

Full View

Full View

Full View

ఇదే వీడియోను ఇతర సోషల్ మీడియా మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా వైరల్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. రాజస్థాన్ కు చెందినది.

2023 సెప్టెంబర్ 16న ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేసి ఓ పాఠశాల విద్యార్థిని హత్య చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం, సైకిల్ పై వెళుతున్న 17 ఏళ్ల బాలిక దుపట్టాను లాగారు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు పోయాయి. ఈ దారుణం సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది, బాధితురాలి తల్లిదండ్రులు నిందితులు షాబాజ్, అర్బాజ్, బైక్‌పై ఉన్న వ్యక్తి ఫైసల్‌గా గుర్తించారు. అనంతరం నిందితులని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాజ్, ఫైసల్ ఆసుపత్రిలో చికిత్స సమయంలో పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకోడానికి ప్రయత్నించే క్రమంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. మూడో నిందితుడు పారిపోతూ ఉండగా అతడి కాలుకు ఫ్రాక్చర్ అయింది.

ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయడం కూడా మనం గమనించవచ్చు.


వీడియో నుండి తీసుకున్న స్క్రీన్‌షాట్‌లను మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. మేము ట్విట్టర్ లో భాగస్వామ్యం చేసిన కొన్ని పోస్ట్‌లను కనుగొన్నాము.

@INDIA9ABS అనే ట్విట్టర్ ఖాతాలో “राजस्थान के सभी अपराधियों से अपेक्षा है कि अटलबंद थाने में गिरफ्तार इन अपराधियों के हालात को देखकर, अपराध से दूर रहने का संकल्प लेंगे." అంటూ వీడియోను పోస్టు చేశారు.

ఈ ఘటన రాజస్థాన్ కు చెందినదని అందులో తెలిపారు. క్రిమినల్స్ కండీషన్ ఇది అందులో తెలిపారు. అటల్ బంద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ వీడియోను సెప్టెంబర్ 17, 2023న పోస్టు చేశారు.


దీన్ని క్యూగా తీసుకుని, మరిన్ని పోస్ట్‌ల కోసం వెతికాము. ఆ వీడియోను రాహుల్ ప్రకాష్ అనే ఐపీఎస్ అధికారి కూడా షేర్ చేసినట్లు గుర్తించాము. రాహుల్ ప్రకాష్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ డీఐజీపీగా విధులు నిర్వహిస్తున్నారు.


రాజస్థాన్‌కు చెందిన న్యూస్ ఛానెల్ 'ఫస్ట్ ఇండియా న్యూస్' యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో కూడా వైరల్ విజువల్స్‌ ను షేర్ చేసింది. ఈ వీడియో టైటిల్ ‘ది అజయ్ ఝామ్రీ హత్య కేసు’కి సంబంధించినదని పేర్కొంది.
Full View

తదుపరి పరిశోధనలో, మేము etvbharat.comలో కూడా ఒక కథనాన్ని కనుగొన్నాము, అరెస్టయిన ముగ్గురు నిందితులు తేజ్‌వీర్, యువరాజ్, బంటీ అని తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో రౌడీ షీటర్ అజయ్ ఝమ్రీని కాల్చామని పోలీసులు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. ఆ సమయంలో పోలీసులు వారిని కాల్చక తప్పలేదు.

కాబట్టి, వైరల్ వీడియో రాజస్థాన్‌కు చెందిన నిందితులను చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ కు ఎటువంటి లింక్స్ లేవు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim :  The video of three accused dragging their feet on the floor with bandaged legs is from Uttar Pradesh. Police caught and punished them within 24 hours of their crime
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News