ఫ్యాక్ట్ చెక్: కాకి నడుస్తున్న మహిళ కనుగుడ్డును పీక్కుని వెళ్లిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు

ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ ను చూస్తూ ఉంటే అనేక కంటి సమస్యలు వస్తాయి. మసక, మసకగా కనిపించడం, కళ్లు పొడిబారడం,;

Update: 2024-09-23 11:15 GMT
Woman attacked by a bird, womans eye pulled by a bird, Crow attacking and pulling out the eye of a person walking on the road, viral video Crow attacking and pulling eye of a person, facts on Crow attacking and pulling the eye

woman's eye pulled by a bird

  • whatsapp icon

ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ ను చూస్తూ ఉంటే అనేక కంటి సమస్యలు వస్తాయి. మసక, మసకగా కనిపించడం, కళ్లు పొడిబారడం, కంటి అలసట, తలనొప్పి, మెడ భుజం భాగాల్లో నొప్పులు లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డిజిటల్ పరికరాల వాడకం నుండి క్రమం తప్పకుండా విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, కాస్త సేదతీరడం, ఇతర పనులు చేస్తూ సమయం గడపడం వంటి లక్షణాలు కళ్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రకృతిలో 5 నిమిషాలు నడవడం కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. పచ్చని ప్రదేశాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. కార్టిసాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

వీధిలో నడుస్తున్న మహిళపై పక్షి దాడి చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఓ పక్షి మహిళ కంటిపై దాడి చేసి కనుగుడ్డును లాగేసిందని వీడియో షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు. వీడియో ప్రారంభంలో కాకి తన ముక్కుతో కనుగుడ్డు పట్టుకున్నట్లు చూపిస్తుంది. తరువాత మనం ఒక పక్షి ఎగురుతూ, ఒక స్త్రీ పై దాడి చేయడం చూడొచ్చు.
ఈ సంఘటన మొత్తాన్ని మహిళ తన ఫోన్ ఉపయోగించి రికార్డ్ చేసింది. క్యాప్షన్ లో “అవుట్‌డోర్‌లో గాగుల్స్ ధరించండి. సన్ గ్లాసెస్ మిమ్మల్ని సూర్యకాంతి, దుమ్ము, గాలి నుండి రక్షించడమే కాకుండా ఈ దాడి చేసే పక్షుల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతాయి." అని ఉంది.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియోలో కనిపిస్తున్న పక్షి కాకి కాదు. వీడియోలో మహిళ కను గుడ్డును పక్షి బయటకు లాక్కునిపోలేదు.
మేము కాకి కనుగుడ్డు పట్టుకొని ఉన్న చిత్రం కోసం శోధించినప్పుడు, ఈ చిత్రం పాతదని, nature picture library ద్వారా షేర్ చేశారని మేము కనుగొన్నాము. ఈ చిత్రం 2014లో ఈ డిజిటల్ లైబ్రరీలో అప్‌లోడ్ చేశారు. క్యాప్షన్‌లో ‘రావెన్ ఫీడింగ్ ఆన్ ది ఐబాల్, బ్లాక్ ఫారెస్ట్, బాడెన్-వుటర్‌బర్గ్, జర్మనీ' అని ఉంది.
నవంబర్ 2023లో News.com.auలో ప్రచురించబడిన కథనం ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న మహిళ ఆస్ట్రేలియాకు చెందిన సారా జేడ్, ఆమె ఒక ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్. సారాపై పీవీ పక్షి(Peewee bird) దాడి చేసింది. ఆ సమయంలో సారా కంటి మీద దాడి చేయాలని పక్షి ప్రయత్నించింది. పక్షి తన ముక్కును సారా కంటిపై ఉంచడాన్ని చూడవచ్చు. టిక్‌టాక్‌లో దాదాపు 200,000 మందికి పైగా అనుచరులు ఉన్న సారా, ఆ ఘటనకు సంబంధించిన ఫుటేజీని సమీక్షించే వరకు ఆ పక్షి ఏమి చేసిందో తనకు తెలియలేదని చెప్పింది.
Yahoo న్యూస్ ఆస్ట్రేలియా నవంబర్ 2023న ఓ కథనాన్ని ప్రచురించింది. సారా ఒక టిక్‌టాక్ పోస్ట్‌లో తనకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటనను వివరించింది. ఆ ఘటన కారణంగా సారా తన కన్నును దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. వైరల్ అయిన ఒరిజినల్ క్లిప్‌లో నలుపు, తెలుపు రంగు ఉన్న పక్షి సారా ముఖం కుడి వైపున తాకడానికి ప్రయత్నించింది. సారా కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. భయంతో సారా అరుపులు కూడా పెట్టింది. ఈ ఘటన తర్వాత తన కన్ను ఎర్రగా మారిపోయిందని సారా తెలిపింది. ఊహించని విధంగా నొప్పి ఉందని, చాలా చిరాకుగా అనిపించిందని తెలిపింది. ఇలాంటి పక్షుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో టోపీ, సన్ గ్లాసెస్ ధరించి వెళ్లాలని ఆమె సూచించింది. అంతేకానీ తన కనుగుడ్డును పక్షి లాక్కొని వెళ్లలేదని సారా ఎక్కడా చెప్పలేదు. చాలా మంది వ్యూవర్స్ ఈ పక్షి పీవీ బర్డ్ అని తెలిపారు.

రిపబ్లిక్ వరల్డ్ వెబ్ సైట్ లో కూడా 'దాదాపు ఆమె కన్ను గీసిన మాగ్ పై దాడికి గురైన భయంకరమైన వీడియోను షేర్ చేసిన మహిళా అంటూ కధనం ప్రచురించింది. 

ఓ కాకి నడుస్తున్న మహిళ కనుగుడ్డును పీక్కుని వెళ్లిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో ప్రజలనుతప్పుదారి పట్టిస్తోంది. పీవీ బర్డ్ ఆస్ట్రేలియా మహిళపై దాడి చేసి గాయపరిచిన వీడియో పాతది. ఆ పక్షి మహిళ కనుగుడ్డును లాగేయలేదు.
Claim :  రోడ్డుపై వెళ్తున్న మహిళపై కాకి దాడి చేసి కనుగుడ్లను పీక్కుపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి
Claimed By :  Facebook Users
Fact Check :  Misleading
Tags:    

Similar News