ఫ్యాక్ట్ చెక్: కేవలం అంబేద్కర్, నారాయణన్ మాత్రమే కాదు చాలా మంది భారతీయులు 'డాక్టర్ ఆఫ్ సైన్స్' పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు
భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్, భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటైన 'డాక్టర్ ఆఫ్ సైన్స్' పరీక్షలో భారతదేశానికి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పోస్ట్ లో “ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్ష DOS అంటే (డాక్టర్ ఆఫ్ సైన్స్). భారతదేశం నుండి కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొదటి బాబా సాహెబ్, రెండవది K.R. నారాయణన్ సర్.. ఇద్దరూ ఎస్సీ అంటరాని కులానికి చెందినవారు." అని ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
డాక్టర్ ఆఫ్ సైన్స్ ను సాధారణంగా D.Sc, Sc.D అని పిలుస్తారు. సైన్స్ రంగంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తికి ఇచ్చే పోస్ట్‌డాక్టోరల్ డిగ్రీ. అనేక విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించబడిన విస్తృతమైన పరిశోధన ఆధారంగా ఈ డిగ్రీని అందిస్తాయి.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రచురించిన అంబేద్కర్ జీవితం, రచనల ఆధారంగా ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, అంబేద్కర్ 'ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ' అనే థీసిస్‌కు 1923లో లండన్ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును ప్రదానం చేసింది. 1987లో కె.ఆర్. నారాయణన్‌కు USAలోని టోలెడో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేసింది.
https://ncsc.nic.in/files/review%20proforma/Life%20and%20works.pdf
https://vicepresidentofindia.nic.in/former-vice-president/sh-kr-narayanan
బి.ఆర్. అంబేద్కర్ మరియు కె.ఆర్. నారాయణన్ గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ అందుకోవడం నిజమే..! అయితే అనేకమంది భారతీయ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇతరులు కూడా ఈ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.
వారి సంబంధిత రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు, అసాధారణమైన విజయాలను సాధించిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తారు. నిర్దిష్ట పరిశోధనా రంగంలో అథారిటీగా గుర్తింపు పొందిన వారికి D.Sc ని ఇచ్చారు. పరీక్షల ద్వారా ఇది దక్కుతుందని కూడా లేదు. డాక్టర్ ఆఫ్ సైన్స్ విషయంలో, ఈ డిగ్రీకి సంబంధించి నిర్దిష్ట పరీక్ష ఏదీ లేదని తెలుస్తోంది.
మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం, భారత అంతరిక్ష శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు, వ్యాపారవేత్త నారాయణ మూర్తి వంటి అనేక మంది ప్రముఖ భారతీయులు, వారి సంబంధిత రంగాలలో కనబరిచిన ప్రతిభ కారణంగా డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు.
https://vtu.ac.in/wp-content/uploads/2020/02/List-of-Doctor-of-science-Award.pdf
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రచురించిన అంబేద్కర్ జీవితం, రచనల ఆధారంగా ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, అంబేద్కర్ 'ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ' అనే థీసిస్‌కు 1923లో లండన్ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును ప్రదానం చేసింది. 1987లో కె.ఆర్. నారాయణన్‌కు USAలోని టోలెడో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేసింది.
https://ncsc.nic.in/files/
https://vicepresidentofindia.
బి.ఆర్. అంబేద్కర్ మరియు కె.ఆర్. నారాయణన్ గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ అందుకోవడం నిజమే..! అయితే అనేకమంది భారతీయ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇతరులు కూడా ఈ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.
వారి సంబంధిత రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు, అసాధారణమైన విజయాలను సాధించిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తారు. నిర్దిష్ట పరిశోధనా రంగంలో అథారిటీగా గుర్తింపు పొందిన వారికి D.Sc ని ఇచ్చారు. పరీక్షల ద్వారా ఇది దక్కుతుందని కూడా లేదు. డాక్టర్ ఆఫ్ సైన్స్ విషయంలో, ఈ డిగ్రీకి సంబంధించి నిర్దిష్ట పరీక్ష ఏదీ లేదని తెలుస్తోంది.
మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం, భారత అంతరిక్ష శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు, వ్యాపారవేత్త నారాయణ మూర్తి వంటి అనేక మంది ప్రముఖ భారతీయులు, వారి సంబంధిత రంగాలలో కనబరిచిన ప్రతిభ కారణంగా డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు.
https://vtu.ac.in/wp-content/
బి.ఆర్ అంబేద్కర్, కె.ఆర్. నారాయణన్ మాత్రమే కాకుండా 30 మందికి పైగా వ్యక్తులు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు.
Claim : Only B.R. Ambedkar and former Indian President K.R. Narayanan had passed the “world’s toughest exam” called Doctor of Science, from India.
Claimed By : Social Media Users
Fact Check : False