నిజ నిర్ధారణ: వృద్ధుడిని ఎక్కించుకొని రిక్షా నడుపుతున్న మహిళ చిత్రంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది

రిక్షా నడుపుతున్న ఒక మహిళ, రిక్షాలో కూర్చున్న వృద్ధుడి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది ఒక పేద తండ్రి, తన కుమార్తెను ఏఎస్ఐ గా చేసాక తీసినది అంటూ పంజాబీ క్లెయింతో వైరల్ అవుతోంది.

Update: 2023-01-19 03:59 GMT

రిక్షా నడుపుతున్న ఒక మహిళ, రిక్షాలో కూర్చున్న వృద్ధుడి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది ఒక పేద తండ్రి, తన కుమార్తెను ఏఎస్ఐ గా చేసాక తీసినది అంటూ పంజాబీ క్లెయింతో వైరల్ అవుతోంది.

కొంతమంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ చిత్రాన్ని పంజాబీ క్లెయిమ్‌తో షేర్ చేస్తున్నారు "“ਬਾਪੂ ਨੇ ਰਿਕਸ਼ਾ ਚਲਾ ਕੇ ਕਮਾਏ ਪੈਸੇ ਨਾਲ ਆਪਣੀ ਧੀ ਨੂੰ ASI ਬਣਾਇਆ, ਸਲੂਟ ਹੈ ਇਸ ਬਾਪੂ ਦੀ ਸੋਚ ਨੂੰ...” తెలుగులోకి అనువదించగా "నాన్న తన కూతురిని ఏఎసై ని చేసాడు, రిక్షా తొక్కడం వల్ల వచ్చిన డబ్బుతో ఇది సాధ్యమయ్యింది, ఈ తండ్రి ఆలోచనకు వందనం"

https://www.facebook.com/photo?fbid=573206764819874lated

https://www.facebook.com/mindarpahwagdr/posts/pfbid021Ye4LaHsWt43bXu74Ey1oeqGv1ZWqw6A3ra75dqXibTLtT4ipD8x7hASo6wSxeXUl

నిజ నిర్ధారణ:

క్లెయిం అవాస్తవం. చిత్రంలో కనిపిస్తున్న వారు తండ్రీ కూతుళ్లు కాదు.

జాగ్రత్తగా గమనించగా, రిక్షాలో కూర్చున్న వృద్ధుడు "దయచేసి స్టార్ మేసన్స్‌ని అనుసరించండి" అని రాసి ఉన్న స్లేట్‌ను పట్టుకుని ఉండటం మనకు కనిపిస్తుంది. దానిని క్యూగా తీసుకొని, స్టార్ మేసన్‌ అనే సంస్థ కి చెందిన వివిధ సోషల్ మీడియా ఖాతాలను శోధించాము.

వారి ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలలో అదే చిత్రం లభించనప్పటికీ, అదే స్త్రీ వైరల్ చిత్రంలో ఉన్నటువంటి స్లేట్‌లాంటి దానినే పట్టుకుని పాఠశాల పిల్లల సమూహంతో ఉన్న మరొక చిత్రాన్ని షేర్ చేసారు.

Full View


జనవరి 15, 2016న వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన చిత్రం, వైరల్ చిత్రాన్ని పోలి ఉండడం గమనించవచ్చు. స్టార్ మాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఇమేజ్‌లో ఎడమ వైపున ఉన్న మూలలో 'సిమ్రన్ కౌర్ ముండీ' అనే టెక్స్ట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సిమ్రాన్‌ కౌర్ ముండీ హ్యాండిల్ కోసం శోధిస్తే, నటి సిమ్రాన్ కౌర్ ముండి ఖాతా లభించింది. ఆమె ఖాతా ప్రకారం, ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2008.

"దయచేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్కూల్‌లో మీరు చదివినవన్నీ నమ్మవద్దు! ఫేస్‌బుక్/ వాట్సాప్/ ఇన్‌స్టాగ్రామ్ స్కూల్‌లో వారు చదివే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్ముతారు!!” " అంటూ వైరల్ చిత్రాన్ని నటి షేర్ చేసింది.

ఈ చిత్రాన్ని ఆమె జనవరి 2016లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.


కనుక, వైరల్ చిత్రం తండ్రి, కుమార్తెలను చూపించడంలేదు, రిక్షా నడుపుతున్న అమ్మాయి మాజీ మిస్ ఇండియా యూనివర్స్ సిమ్రాన్ కౌర్ ముండి. ఆమె పోలీసులలో ఏఎస్ఐ కాదు.

Claim :  Viral image shows father and daughter in rickshaw
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News