ఫ్యాక్ట్ చెక్: 500 రూపాయల నోట్ల కట్టలపై మనిషి పడుకున్నట్లు చూపే చిత్రాలు UPPL నేత బెంజమిన్ బాసుమతరీ.. జనవరిలోనే ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు
UPPL నేత బెంజమిన్ బాసుమతరీ.. జనవరిలోనే ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు
బెంజమిన్ బాసుమతరీకి చెందిన వివాదాస్పద ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. అస్సాంకు చెందిన రాజకీయ నాయకుడు బెడ్‌పై ఉన్న రూ.500 కరెన్సీ నోట్లపై.. కేవలం టవల్ ధరించి నిద్రిస్తున్నట్లు ఆ ఫోటో చూపిస్తుంది.
సోషల్ మీడియా వినియోగదారులు బీజేపీ కూటమిలోని నాయకుడు అతడు అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. “బీజేపీ అస్సాం కూటమి భాగస్వామి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) నాయకుడు ప్రమోద్ బోరో రూ. 500 కరెన్సీ నోట్ల కుప్పపై పడుకున్నట్లు గుర్తించారు. కానీ @dir_ed ఆయన నివాసంపై దాడి చేయరు." అని వైరల్ పోస్టుల్లో ఉన్నాయి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) కూడా ఈ చిత్రాన్ని మార్చి 27, 2024న వారి సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.
“नोटों के बीच लेटे हुए शख्स का नाम है बेंजामिन बसुमतारी बेंजामिन UPPL पार्टी का सक्रिय नेता है । UPPL असम में BJP का अहम सहयोगी दल है ।
चुनाव के बीच आई यह तस्वीर बताती है कि BJP और उसके सहयोगी दल भ्रष्टाचार के दलदल में लोट रहे हैं।
BJP ने चुन चुनकर उन लोगों के साथ गठबंधन किया है, जो उनकी तरह देश को लूट सके” ।
“కరెన్సీ నోట్ల కుప్పపై పడి ఉన్న వ్యక్తి పేరు బెంజమిన్ బసుమతరీ. బెంజమిన్ అస్సాంలో BJPకి ముఖ్యమైన మిత్రపక్షమైన UPPL పార్టీలో క్రియాశీల నాయకుడు. ఎన్నికల మధ్య ఈ చిత్రం బయటకు వచ్చింది. బీజేపీ,ఆ పార్టీ మిత్రపక్షాలు అవినీతిలో కూరుకుపోతున్నాయని ఇవి తెలియజేస్తున్నాయి. తమలాగా దేశాన్ని దోచుకునే వారితో బీజేపీ సెలెక్టివ్‌గా పొత్తు పెట్టుకుంది." అని అందులో ఉంది.
అసోం కాంగ్రెస్ కూడా అదే ఛాయాచిత్రాలను పంచుకుంది:
“বিৰোধীৰ ওপৰত ৰাজনৈতিক অস্ত্ৰ হিচাপে ব্যৱহাৰ হোৱা EDৰ চকু পৰিব নে? UPPL কর্মী তথা VCDCৰ অধ্যক্ষ বেঞ্জামিন বসুমতাৰীয়ে শোৱে টকাৰ ওপৰত” అంటూ పోస్టు పెట్టింది. ప్రతిపక్షాలపై ఈడీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.. UPPL నాయకుడు, VCDC ఛైర్మన్ బెంజమిన్ బసుమతరీ నోట్ల కట్టల మీద నిద్రపోతున్నాడన్నది.. ఆ పోస్టుకు అర్థం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
500 రూపాయల నోట్లతో మంచం మీద పడుకున్న వ్యక్తి బెంజమిన్ బాసుమతరీ. అతను జనవరి 10, 2024 నుండి UPPL (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్)తో సంబంధాలు తెంచుకున్నాడు.
మేము ప్రమోద్ బోరో గురించి సెర్చ్ చేసినప్పుడు.. “ప్రమోద్ బోరో 25 ఫిబ్రవరి 2020 నుండి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) అధ్యక్షుడిగా ఉన్నారు. స్వయంప్రతిపత్త ప్రాంతమైన బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు." అని తెలుసుకున్నాం.
మేము వైరల్ ఫోటోగ్రాఫ్‌లను ప్రమోద్ బోరో ఫోటోలతో పోల్చినప్పుడు.. రెండు చిత్రాలు భిన్నంగా ఉన్నాయని మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వాదనల ప్రకారం ప్రమోద్ బోరో వైరల్ ఫోటోగ్రాఫ్‌లలో లేడని ధృవీకరించాం.
వైరల్‌గా కనిపిస్తున్న వ్యక్తి బెంజమిన్ బాసుమతరీ కాదా అని తెలుసుకోవడానికి మేము Google రివర్స్ ఇమేజ్‌ని ఉపయోగించాం. 28 మార్చి 2024న ఒక డిజిటల్ క్రియేటర్ Tangla Smart City బెంజమిన్ బాసుమతరీ ప్రతి స్పందనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
వైరల్ అవుతున్న ఫోటో పాతదని వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారని బెంజమిన్ బాసుమతరీ అన్నారు.
అస్సాంలోని BJP నేతృత్వంలోని పాలక కూటమిలో భాగమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఈ వివాదానికి సంబంధించి ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. “బెంజమిన్ బాసుమత్రి ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉందని మేము గమనించాము. జనవరి 10, 2024న సస్పెన్షన్‌కు గురైనప్పటి నుండి బాసుమత్రికి UPPLతో ఎలాంటి సంబంధం లేదని మేము స్పష్టం చేస్తున్నాం” అని అందులో ఉంది.
యునైటెడ్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు లిబరల్ ప్రమోద్ బోరో కూడా వివరణ ఇచ్చారు. "జనవరి 10, 2024న పార్టీ నుండి బాసుమత్రిని సస్పెండ్ చేశారు. UPPLతో ఇకపై సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము" అనే పోస్ట్ పెట్టారు.
“ఈ ఫోటో ఐదేళ్ల క్రితం తన స్నేహితులు ఓ పార్టీలో తీశారని బెంజమిన్ బసుమతరీ చెప్పారు” అని హిందూస్థాన్ టైమ్స్ 27 మార్చి 2024న ఒక కథనాన్ని ప్రచురించింది.
“Suspended UPPL member's photo of sleeping with bundles of money stirs row” అంటూ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కేవలం టవల్ వేసుకుని మంచం మీద రూ. 500 కరెన్సీ నోట్లతో నిద్రపోతున్న రాజకీయ నాయకుడు బెంజమిన్ బాసుమతరీ.
Claim : అస్సాంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉన్న UPPL పార్టీ నేత ప్రమోద్ బోరో రూ.500 కరెన్సీ నోట్లపై పడుకున్నారు
Claimed By : Social Media Users
Fact Check : False