ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడిపై భజనలను పాడలేదు

శ్రీరాముడి భజనను భారత ప్రధాని నరేంద్ర మోదీ పాడారనే వాదనతో ఓ భజనతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.

Update: 2023-03-27 12:15 GMT
శ్రీరాముడి భజనను భారత ప్రధాని నరేంద్ర మోదీ పాడారనే వాదనతో ఓ భజనతో కూడిన వీడియో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో “ఈ రామ భజన్ ను ఎవరు పాడుతున్నారో ఊహించండి?? అది మరెవరో కాదు మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ జీ. దేశ సంస్కృతిని గురించి తెలుసుకున్న ప్రధాన మంత్రి ఉన్న దేశం ధన్యమైంది. ఇది చాలా గర్వించదగిన విషయమని పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
Full View
Full View
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ వాదనతో 2022 లో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి.వైరల్ వీడియోలో భజనను పాడింది భారత ప్రధాని మోదీ అన్న వాదన అవాస్తవం. ప్రేమభూషణ్‌జీ మహారాజ్ ఈ భజనను పాడారు.భజనను వింటున్నప్పుడు “నర్ షరీర్ అన్మోల్ రే ప్రాణి” అనే పదాలు కనిపించాయి. ఈ కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ భజనకు సంబంధించిన అనేక YouTube వీడియోలను మేము కనుగొన్నాము.వైరల్ వీడియో మాదిరిగానే విజువల్స్‌తో కూడిన ఈ వీడియోలలో ఒకటి కనుగొనబడింది. ఈ వీడియోలో పాట పాడిన కళాకారుడి పేరు లేకపోయినప్పటికీ, ఈ వీడియో కింద ఉన్న కామెంట్లలో ప్రేంభూషణ్‌జీ మహారాజ్ భజన పాడారని పేర్కొన్నారు.

 

Full View

ఒరిజినల్ గా పాడింది ప్రేంభూషణ్‌జీ మహారాజ్ అని తెలిపే ‘నిరంకర్ భక్తి’ అనే యూట్యూబ్ ఛానెల్ కు చెందిన మరొక వీడియోని కూడా కనుగొన్నాము.

Full View

భజన్‌లోని పదాలతో పాటు, ఆయన పేరుతో వెతకడం ద్వారా, “రామ్ నామ్ ఏకే సబున్ సే.. నారాయణ్ మిల్ జాయేగా *పూజ్య ప్రేంభూషణ్‌జీ మహారాజ్* భజన్” “Ram Naam eke Sabun se.. Narayan mil Jayega *Pujya Prembhushanji Maharaj* Bhajan” అనే శీర్షికతో ప్రేంభూషణ్‌జీ మహారాజ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన అసలు వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో మార్చి 2021లో ప్రచురించారు.

Full View

వైరల్ వీడియోలో వినిపించిన భజనను ప్రేంభూషణ్‌జీ మహారాజ్ పాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాడలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim :  Modi sang Bhajan heard in the viral video
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News