నిజ నిర్ధారణ - హైదరాబాద్ లో లభించిన డెవిల్ ఫిష్.. ఆకాశం నుండి ఊడి పడలేదు

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఆకాశం నుండి అరుదైన చేప జారిపడిందనే వాదనతో చేప చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి.

Update: 2022-09-14 05:23 GMT

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఆకాశం నుండి అరుదైన చేప జారిపడిందనే వాదనతో చేప చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి.

యూట్యూబ్ వీడియో ఒకటి ఆకాశం నుండి చేప పడిందని వివరిస్తోంది. తెలుగు భాషలో ఉన్న వాదన (క్లెయిం) ఇలా ఉంది "హైదరాబాద్ రామంతపూర్ సాయి కృష్ణ నగర్ లో అరుదైన చేప సాక్షాత్కరించింది సోమవారం కురిసిన వర్షానికి ఆకాశం నుండి ఊడిపోవచ్చు అని స్థానికులు అనుమానిస్తున్నారు ఇది అరుదుగా కనిపించే డెవిల్ చేప అని స్థానికుల పేర్కొంటున్నారు. దాన్ని చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు."

Full View

Full View


Full View

నిజ నిర్ధారణ:

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో చేప ఆకాశం నుంచి రాలి పడిందన్న వాదన అవాస్తవం.

ఆ ప్రాంతంలో డెవిల్ ఫిష్ కనిపించిన మాట వాస్తవమే అయినా.. ఈ చేప ఆకాశం నుంచి పడిపోయిందనేదానిలో నిజం కాదు.

ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, నగరంలో నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌లో డెవిల్ ఫిష్ అని కూడా పిలువబడే సక్కర్‌మౌత్ క్యాట్ ఫిష్ వరద నీటిలో చిక్కుకుంది.

నగరంలోని రామంతాపూర్ వాసులు సమీపంలో ఉన్న కాలువల నుంచి వరద నీరు కారణంగా అక్కడికి అది కొట్టుకు వచ్చిన చేప ను కనుగొన్నారు. ఈ చేప అసాధారణంగా ఉండడంతో అందరూ దానిని చూడడానికి గుమిగూడారు.

freepressjournal.in లో ప్రచురించిన నివేదిక ప్రకారం, నగరంలో భారీ వర్షాలు కురిసిన తరువాత, స్థానికంగా ఉన్న ఒక మహిళ తన చేతుల్లో పదునైన రెక్కలతో ఉన్న చేపను పట్టుకున్నట్లు ఒక వీడియో విడుదల అయ్యింది, చుట్టుపక్కల వారు ఆ జీవిని చూసేందుకు ఆ ప్రదేశానికి తరలి వచ్చారు.

శోధించగా, తెలంగాణలోని నీటి వనరులలో ఇలాంటి డెవిల్ ఫిష్ దొరికిన కొన్ని సందర్భాలు మాకు లభించాయి.

తెలంగాణ టుడే కథనం ప్రకారం, 2020 అక్టోబర్‌లో చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో 'అమెజాన్ సెయిల్‌ఫిన్ క్యాట్‌ఫిష్' పట్టుబడింది. గ్రామానికి చెందిన ఎర్ల వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు స్థానిక వాగులో చేపల వేటలో ఈ చేపను పట్టాడు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాట్ ఫిష్ అనేది సాయుధ క్యాట్ ఫిష్ కుటుంబానికి చెందిన (లోరికారిడే) మంచినీటి ట్రాపికల్ చేప. ఈ జాతి బ్రెజిల్, పెరూలలోని అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతానికి చెందినది.

అమెజాన్ సెయిల్‌ఫిన్ క్యాట్‌ఫిష్ ఆక్రమించే జాతి, ఇది స్థానిక చేపలను తింటుంది, వాటి జనాభాను తగ్గిస్తుంది. ఆగస్ట్‌లో కూడా, పలైర్‌లో ఒక మత్స్యకారుడు ఇలాంటి చేపను పట్టుకున్నాడు, దానిని ఇప్పుడు ఆ స్థలంలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్)లోని అక్వేరియంలో పెంచుతున్నారు.

ఫిబ్రవరి 2022లో ఈటీవీ తెలంగాణ యూట్యూబ్ లో ప్రసారం అయిన ఒక వీడియో కూడా లభించింది, ఇది అమెజాన్ సెయిల్‌ఫిన్ క్యాట్‌ఫిష్ (లేదా డెవిల్ ఫిష్) తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మత్స్యకారులను ఎలా భయపెడుతున్నదో నివేదించింది. స్థానిక చేపలను తినడం ద్వారా, డెవిల్ ఫిష్ మత్స్యకారుల ఉత్పత్తి ని తగ్గిస్తుంది, వారు కిల్లర్ జాతి చేపలు ఎక్కడ నుండి వచ్చాయో తెలియక సతమతమౌతున్నారు. గతేడాది పదుల సంఖ్యలో ఉన్న డెవిల్ ఫిష్ ఇప్పుడు వందలకు పెరిగింది, అని ఈ వీడియో పేర్కొనింది.

Full View

అమెజాన్ సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ ఇతర చేపలు, సముద్ర జీవులను తినడం వల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థకు ప్రమాదమని పేర్కొంటూ ఇతర నివేదికలు వివిధ వార్తా వెబ్‌సైట్‌లలో లభించాయి.

అందువల్ల, అరుదైన చేప ఆకాశం నుండి పడడం అనే వాదన అవాస్తవం. ఈ చేప అమెజాన్ సెయిల్ఫిన్ క్యాట్ ఫిష్, దాని ఆక్రమించే స్వభావానికి ప్రసిద్ధి చెందిన చేప.

Claim :  Rare fish falls from the sky in Hyderabad
Claimed By :  Youtube videos
Fact Check :  False
Tags:    

Similar News