ఫ్యాక్ట్ చెక్: ఆ రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ పెన్నుల తయారీ కొనసాగుతుంది
పిల్లల నుండి పెద్దల దాకా రేనాల్డ్స్ పెన్స్ అంటే తెలియని వాళ్లంటూ ఉండరు. భారతదేశంలో రేనాల్డ్స్ 80లలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రసిద్ధ రేనాల్డ్స్ 045 పెన్‌తో పాటు దేశంలో అనేక ఉత్పత్తులను కలిగి ఉంది.
పిల్లల నుండి పెద్దల దాకా రేనాల్డ్స్ పెన్స్ అంటే తెలియని వాళ్లంటూ ఉండరు. భారతదేశంలో రేనాల్డ్స్ 80లలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రసిద్ధ రేనాల్డ్స్ 045 పెన్‌తో పాటు దేశంలో అనేక ఉత్పత్తులను కలిగి ఉంది. కొంతమంది X వినియోగదారులు ప్రసిద్ధ రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ పెన్ తయారీని రేనాల్డ్స్ సంస్థ నిలిపివేస్తూ ఉందని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను వైరల్ చేయడం ప్రారంభించారు.
చాలా మంది వినియోగదారులు తమ చిన్నతనంలో పెన్ను ఉపయోగించిన విధానం, ఆ పెన్నులతో ఉన్న అనుబంధం గురించి రాయడం ప్రారంభించారు. 90వ దశకంలో విద్యార్థులకు ఎంతో ఇష్టమైనది ఈ పెన్. ‘045’ అంటే 1945లో ఈ కలం కనిపెట్టారు. రేనాల్డ్స్ పెన్స్ భారతదేశంలోని న్యూవెల్ బ్రాండ్ కు అనుబంధ సంస్థగా ఉంది.
పలువురు ట్విట్టర్ యూజర్లు “Reynolds 045 Fine Carbure will no longer be available in the market, end of an era..” అంటూ పోస్టులు పెట్టారు. ఈ పెన్నుల తయారీని ఆపేయడం ద్వారా ఒక శకానికి ముగింపు పలికారంటూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చెప్పుకొచ్చారు.

మరికొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ విధంగా పోస్టులు పెట్టారు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. రేనాల్డ్స్ ఇండియా మేనేజ్‌మెంట్ ఈ వాదనలను తప్పుడు సమాచారం అని కొట్టిపారేసింది.మరింత సమాచారం కోసం వాదనలను, వాటిపై వ్యాఖ్యలను సెర్చ్ చేయగా ఒక X వినియోగదారు చేసిన కామెంట్ ను మేము కనుగొన్నాము, రేనాల్డ్స్ 045 మోడల్ తయారీ కొనసాగుతుందని రేనాల్డ్స్ స్పష్టం చేసినట్లు తెలిపారు.
రేనాల్డ్స్ అధికారిక Facebook ఖాతాలో, కంపెనీ పెన్ తయారీని కొనసాగిస్తున్నట్లు వివరించింది. “ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రచారంలో ఉందని మేము స్పష్టం చేస్తున్నాము. వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. నిజమైన, ఖచ్చితమైన సమాచారం కోసం మా అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలను సంప్రదించాలని మేము మా భాగస్వాములు, వాటాదారులు, కస్టమర్‌లకు సలహా ఇస్తున్నాము. మీ నమ్మకమే మా అత్యంత ప్రాధాన్యత. ” అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీన్ని బట్టి రేనాల్డ్స్ పెన్ మీద జరుగుతున్న ప్రచారం సరైనది కాదని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని రేనాల్డ్స్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Reynolds-pens.com కంపెనీ వెబ్సైట్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వదంతుల్లో ఏ మాత్రం నిజం లేదని కస్టమర్లకు, పార్ట్నర్లకు, వాటాదారులకు తెలిపింది.
రేనాల్డ్స్ గురించి తప్పుడు సమాచారం వివిధ మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఇదంతా ప్రజలను తప్పుదారి పట్టించేది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. రేనాల్డ్స్, భారతదేశంలో దాని 45-సంవత్సరాల నుండి పని చేస్తోంది. నాణ్యత, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తుంది. భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి మాకు భవిష్యత్తు ప్రణాళిక ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం మా వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లను మాత్రమే పరిశీలించాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా అత్యంత ప్రాధాన్యత. మీ తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు. (రేనాల్డ్స్ ఇండియా మేనేజ్‌మెంట్)

అందువల్ల, రేనాల్డ్స్ ప్రసిద్ధ రేనాల్డ్స్ ఫైన్ కార్బర్ 045 పెన్‌ను నిలిపివేస్తున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు. కంపెనీకి అలాంటి ఉద్దేశాలు లేవు.
Claim : Reynolds pens company is discontinuing Reynolds 045 Fine Carbure pens in India
Claimed By : Social Media Users
Fact Check : False