ఫ్యాక్ట్ చెక్: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం గోడలపై అప్పుడే పగుళ్లు ఏర్పడలేదు

మహారాష్ట్రలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల విగ్రహం ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత 2024 ఆగస్టు 26న కూలిపోయింది. విగ్రహ నిర్మాణంలో నాణ్యత లోపించిందని, నట్లు, బోల్టులు తుప్పు పట్టాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Update: 2024-09-10 06:12 GMT

Statue of Unity

మహారాష్ట్రలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల విగ్రహం ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత 2024 ఆగస్టు 26న కూలిపోయింది. విగ్రహ నిర్మాణంలో నాణ్యత లోపించిందని, నట్లు, బోల్టులు తుప్పు పట్టాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ప్రతిపక్షం దీనిని మరాఠా చక్రవర్తికి అవమానంగా ఆరోపించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి కూడా పగుళ్లు ఏర్పడటం ప్రారంభించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విగ్రహానికి పగుళ్లు ఏర్పడ్డాయి, ఎప్పుడైనా పడిపోవచ్చనే వాదనతో వినియోగదారులు విగ్రహం చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. పాదాల భాగానికి సమీపంలో విగ్రహంపై కొన్ని పగుళ్లను మనం చూడవచ్చు.
“स्टैचू ऑफ यूनिटी, जिसे 3000 करोड़ रुपए की लागत से बनाया गया, अब उसकी दीवारों में दरारें आ रही हैं। यह भ्रष्टाचार और बेईमानी का साफ़ प्रमाण है। ऐसा लगता है कि या तो मोदी बेईमानों के कब्जे में हैं, या फिर उन्हें शरण दे रहे हैं। अगर देशवासी अब भी नहीं जागे, तो हमारा देश पूरी तरह से लुट जाएगा। समय रहते आवाज़ उठाओ, नहीं तो बहुत देर हो जाएगी!” అంటూ హిందీలో పోస్టు పెట్టారు.
“రూ. 3000 కోట్లతో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ గోడలలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఇది అవినీతికి, నిజాయితీకి నిదర్శనం. అవినీతిపరుల కబంధ హస్తాల్లో ప్రధాని ఉన్నారా? అక్రమార్కులకు మోదీ ఆశ్రయం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా దేశప్రజలు మేల్కోకపోతే మన దేశాన్ని పూర్తిగా దోచుకుంటారు. సమయానికి స్వరం పెంచండి, లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది! ” అని ఆ పోస్టుల్లో ఉంది.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న చిత్రం పాతది. 2018లో విగ్రహం నిర్మాణ సమయంలో ఈ ఫోటోను చిత్రీకరించారు.

మేము ఈ చిత్రాన్ని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. చిత్రం 2018 నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మేము కనుగొన్నాము.
అక్టోబర్ 2018లో వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురించిన ఒక కథనంలో పెద్ద ఫోటోను షేర్ చేశారని మేము కనుగొన్నాము. భారతదేశంలో కొత్త స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం జరుగుతోందని, 1940లలో దేశాన్ని ఏకం చేసిన ఘనత సాధించిన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ ను భారతీయులు స్మరించుకుంటున్నారని తెలిపారు. ‘Indian workers at the construction site of the Statue of Unity on Oct. 18. (Divyakant Solanki/EPA-EFE/REX/
Shutterstock)’ అనే క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేశారు.
దీన్ని క్యూ గా తీసుకొని, మేము కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. అక్టోబర్ 18, 2018న ప్రచురించిన షట్టర్‌స్టాక్ చిత్రాన్ని మేము కనుగొన్నాం. ఆ ఇమేజ్ కు వివరణలో “Indian workers at the construction site of the "Statue of Unity" portraying Sardar Vallabhbhai Patel, at Kevadia, some 200 kilometers from Ahmadabad, India, 18 October 2018. According to reports, the statue is slated to be the world's tallest statue with a height of 182 metres and is being built as the memorial to Indian freedom fighter Sardar Vallabhbhai Patel also known as 'Iron Man of India'. Indian Prime Minister Narendra Modi is scheduled to inaugurate the statue on 31 October, the birthday of Sardar Vallabhbhai Patel.” ఇలా ఉంది. 18 అక్టోబర్ 2018న భారతదేశంలోని అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని కెవాడియాలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ "స్టాట్యూ ఆఫ్ యూనిటీ" నిర్మాణ ప్రదేశంలో భారతీయ కార్మికులు ఉన్నారు. నివేదికల ప్రకారం, ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమని తెలిపారు. 182 మీటర్లు ఉంది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నం. ఆయన్ను 'భారతదేశ ఉక్కు మనిషి' అని కూడా పిలుస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని అందులో వివరించారు.
ఈ చిత్రంలో, మనం పాదాల మీద అదే పగుళ్లు, పక్కన ఉన్న కార్మికులను కూడా చూడవచ్చు. రెండింటికీ మధ్య పోలిక ఇక్కడ చూడొచ్చు


గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో కూడా ఇటీవల పగుళ్లు ఏర్పడ్డాయని, కూలిపోవడానికి సిద్ధంగా ఉందనే వాదన అబద్ధం. సర్క్యులేషన్‌లో ఉన్న చిత్రం పాతది, 2018లో నిర్మాణం జరుగుతున్నప్పటి ఫోటోను వైరల్ చేశారు. 

వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim :  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం గోడలపై అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News