నిజ నిర్ధారణ: తరగతి గదిలో ఉపాధ్యాయుడు తన బిడ్డను మోస్తూ క్లాస్ చెప్తున్నారు అంటూ వైరల్ అవుతున్న చిత్రం తప్పుదారి పట్టిస్తోంది
క్లాస్‌రూమ్‌లో శిశువును నడుముకు కట్టుకొని ఉపాధ్యాయుడు బోధిస్తున్న చిత్రం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా షేర్ అవుతోంది, “అతని భార్య ప్రసవ సమయంలో మరణించింది, అయితే పిల్లడి బాధ్యతను ఆయనే తీసుకున్నాడు. నిజ జీవితంలో హీరో."
క్లాస్‌రూమ్‌లో శిశువును నడుముకు కట్టుకొని ఉపాధ్యాయుడు బోధిస్తున్న చిత్రం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా షేర్ అవుతోంది, "అతని భార్య ప్రసవ సమయంలో మరణించింది, అయితే పిల్లడి బాధ్యతను ఆయనే తీసుకున్నాడు. నిజ జీవితంలో హీరో."
ఈ చిత్రం 2021లో కూడా వైరల్ అయ్యింది.
నిజ నిర్ధారణ:
తన భార్య మరణించిన తర్వాత తరగతి గదిలో ఉపాధ్యాయుడు తన కుమారుడిని ఎత్తుకుని క్లాస్ చెప్తున్నారు అనే వాదన తప్పుదారి పట్టించేది. అతను తన విద్యార్థి బిడ్డను, ఆమె నోట్స్ రాసుకునేందుకు సహాయం గా బిడ్డను ఆయన ఎత్తుకున్నారు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, సిఎనెన్ ఎస్పానోల్ లో "ఉపాధ్యాయుడు తన విద్యార్థి బిడ్డను ఎత్తుకున్నాడు, ఆమె నోట్స్ తీసుకోవచ్చునని" అనే శీర్షికతో వైరల్ ఇమేజ్‌ని షేర్ చేస్తున్న కథనం లభించింది.
సిఎనెన్ ఎస్పానోల్ ప్రకారం, ఒక మెక్సికన్ ఉపాధ్యాయుడు తన విద్యార్థి శిశువును ఎత్తుకున్ని లెసన్ చెప్తున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు, బాబు ఆమెను క్లాస్ విననీయకుండా అల్లరి చేస్తుండడం వల్ల ఆయన ఇలా చేసారు. చిత్రంలో ఉన్న ఉపాధ్యాయుడు అకాపుల్కో లోని ఇంటర్-అమెరికన్ యూనివర్శిటీ ఫర్ డెవలప్‌మెంట్, ఊణీడ్లో లా ప్రొఫెసర్ అయిన మోయిసెస్ రెయెస్ సాండోవల్.
ఆ బాబు తల్లి యాలెనా సలాస్ (22) గర్వకారణం అని ప్రొఫెసర్ ఈ చిత్రాన్ని పంచుకున్నారు, ఎందుకంటే అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, ఆమె చదువు మానేయకుండా చదువును కొనసాగిస్తోంది. మెక్సికోలో పాఠశాల డ్రాపౌట్‌లు ఎక్కువగా ఉన్నాయి, ఈ చిత్రం ఉపాధ్యాయుడు విద్యార్థిని చేసిన గొప్ప ప్రయత్నాన్ని ప్రదర్శిస్తుంది.
ప్రొఫెసర్ ఫేస్‌బుక్‌లో పిల్లవాడిని మోసుకెళ్తున్న తన ఫోటోను క్యాప్షన్‌తో పంచుకున్నారు, "నాకు ఒక విద్యార్థి ఉంది, ఆమె విభిన్న పాత్రలు ఉన్నప్పటికీ పాఠశాల నుండి నిష్క్రమించలేదు, అందుకే నేను నోట్స్ రాసుకోవడానికి తరగతికి అంతరాయం కలగకుండా ఆమె కొడుకును ఎత్తుకొవాలని నిర్ణయించుకున్నాను. #అకాపుల్కో"
ఆల్టోనివెల్.కాం.ఎమెక్స్ ప్రకారం, ఉపాధ్యాయుడు ఆరునెలల వయసున్న యారెత్‌ను సంచిలో 45 నిమిషాలు ఎత్తుకుని బోధన కొనసాగించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆశ్చర్యానికి, పిల్లవాడు తరగతి అంతటా ప్రశాంతంగా ఉన్నాడు.
అందువల్ల, ప్రసవ సమయంలో తన భార్య చనిపోవడంతో ఉపాధ్యాయుడు తన బిడ్డను ఎత్తుకుని బోధిస్తున్నాడని వాదన తప్పుదారి పట్టించేది. అతను తన విద్యార్థి బిడ్డను ఎత్తుకున్నాడు, తద్వారా ఆమె నోట్స్ రాసుకుని తరగతిపై దృష్టి పెట్టింది.