ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు;

Update: 2024-10-03 05:48 GMT
TelanganaCongress, KondaSurekha, KondaSurekhaComments, Samantha, Akkineni, Nagachaitanya, viral posts claiming that Telangana Congress leader Konda Surekha is no more, viral news on kondasurekha, latest fact check in telugu today

KondaSurekha

  • whatsapp icon
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ టాలీవుడ్ నటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న సమయంలో కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ పేరును కూడా కొండా సురేఖ ప్రస్తావించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయలేదని కొండా సురేఖ అన్నారు. దానికి కారణం కేటీఆర్ పెట్టిన ఒక కండీషన్ అంటూ కొండా సురేఖ ఆరోపణలు చేశారు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. నాగ చైతన్యతో విడాకుల గురించి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సమంత ప్రభు తీవ్రంగా స్పందించారు. మంత్రి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సమంత సూచించారు. అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

అయితే కొండా సురేఖ చనిపోయారంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.



ఫ్యాక్ట్ చెకింగ్:

కొండా సురేఖ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమంత, అక్కినేని అభిమానులు ఇలాంటి పోస్టులు పెట్టి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

కొండా సురేఖ అంటూ మేము సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ చేశాం. ఆమె చనిపోయారంటూ ఎలాంటి నివేదిక కూడా మాకు కనిపించలేదు. ఆమె బ్రతికే ఉన్నారు.

వైరల్ పోస్టుల్లో మరణం అనే చోట తేదీ 02-10-2024 అని ఉండగా.. 03-10-2024న సమంత పై చేసిన వ్యాఖ్యలను తాను వెనక్కు తీసుకుంటున్నట్లుగా కొండా సురేఖ వివరణ ఇచ్చారంటూ పలు మీడియా సంస్థలు కథనాన్ని ప్రచారం చేశాయి.

తన వ్యాఖ్యలు మహిళలను కించపరుస్తున్న నాయకుడు కేటీఆర్ ను ప్రశ్నించే ఉద్దేశ్యంతో చేశాను తప్ప సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని అన్నారు. తన జీవిత ప్రయాణంలో సమంత చూపిన తెగువను తాను మెచ్చుకుంటున్నానన్నారు కొండా సురేఖ. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ క్షమాపణలు తెలిపారని మీడియా సంస్థలు తెలిపాయి.

అందుకు సంబంధించిన లింక్ ను మీరు చూడొచ్చు.

కొండా సురేఖ 03-10-2024న క్షమాపణలు చెప్పిన కథనాలను చూడొచ్చు.

Full View


Full View


ఇక కొన్ని గంటల కిందట బతుకమ్మ కార్యక్రమంలో కూడా కొండా సురేఖ పాల్గొన్నారు.

Full View


Full View


03-10-2024న కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలకు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు.
సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని మీడియాతో కొండా సురేఖ తెలిపారు. అయితే మంత్రి కేటీఆర్‌ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం క్షమాపణలు చెప్పనని అన్నారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టనన్నారు.

తాను ఏ విష‌యంలోనైతే బాధ‌ప‌డ్డానో ఆ విష‌యంలో మ‌రొక‌రిని నొప్పించాన‌ని తెలిసి నా వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నానన్నారు కొండా సురేఖ. నేను ప‌డ్డ బాధ మ‌రొక‌రు ప‌డ‌కూడ‌ద‌ని దీనిపై స్పందిస్తూ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టానన్నారు. అయితే, కేటీఆర్ విషయంలో మాత్రం వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేదన్నారు. కేటీఆర్ రివ‌ర్స్‌లో న‌న్ను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉందని కొండా సురేఖ అన్నారు. ఆయ‌న వ్య‌వ‌హారం దొంగే.. దొంగా దొంగా అన్న‌ట్లుగా ఉందని ఎద్దేవా చేశారు కొండా సురేఖ.

కాబట్టి, కొండా సురేఖ చనిపోయారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Update: the derogatory remarks made of the Telangana Congress leader Konda Surekha have been edited on October 26, 2024


Claim :  తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెలియజేస్తున్నాయి
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News