ఫ్యాక్ట్ చెక్: థ్రాంబోబ్లిస్ (Thrombobliss) ట్యాబ్లెట్లు డెంగ్యూను 2 రోజుల్లో నయం చేయలేవు
థ్రాంబోబ్లిస్ మాత్రలు డెంగ్యూను నయం చేయగలవని, వాటిని తీసుకున్న రోగి 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వాట్సాప్ సందేశం వైరల్ అవుతుంది.;

Thrombobliss
థ్రాంబోబ్లిస్ మాత్రలు డెంగ్యూను నయం చేయగలవని, వాటిని తీసుకున్న రోగి 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వాట్సాప్ సందేశం వైరల్ అవుతుంది.
ఈ వాట్సాప్ మెసేజీ పోస్ట్ మీద ఆగస్ట్ 26 అని ఉంది. కానీ సంవత్సరం స్పష్టంగా లేదు.
“దయచేసి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయకుండా తొలగించవద్దు.
ముందుకు రండి, "డెంగ్యూ" గురించి విచారించకండి. "డెంగ్యూ ఫీవర్" అనే మహమ్మారి ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందో చూడండి. కానీ ఫ్రెండ్స్, "డెంగ్యూ" చికిత్సకు ఔషధం దొరికింది !! అందుకనే దయచేసి ఫార్వర్డ్ చెయ్యకుండా ఈ సందేశాన్ని తొలగించవద్దు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు పంపండి. ఈ సందేశం 110 కోట్ల మంది భారతీయులకు చేరాలి. '"THROMBOBLISS ' TABLETS AND SYRUP అనేది డెంగ్యూ చికిత్సకు ఒక ఔషధం. 2 రోజుల్లోపు తీసుకున్న రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇది శుభవార్త. రక్తంలో ప్లేట్లెట్ల గణనను మరింత వేగవంతంగా మెరుగుపరుస్తుంది. దయచేసి అవేర్ నెస్ కలిగించండి. ఇది ఎవరికైనా సహాయపడవచ్చు.ఇది చాలా చవకైనది.✅ 🙏🙏🙏 అభ్యర్ధన.

మేము Facebookలో ఈ పోస్ట్ కోసం వెతికాం.. ఆ పోస్ట్ ఆగస్ట్ 26, 2019 నాటిదని మేము కనుగొన్నాము. Facebookలో 2019లో ఇలాంటి పోస్ట్‌లు ప్రచురించారు.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
థ్రాంబోబ్లిస్ మాత్రలు రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి కానీ డెంగ్యూను పూర్తిగా నయం చేయలేవు. మేము థ్రాంబోబ్లిస్ టాబ్లెట్‌లు, సిరప్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా.. మేము అనేక రిజల్ట్స్ ను కనుగొన్నాము.
రిటైల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ 1mg.com అనే వెబ్‌సైట్ లో థ్రాంబోబ్లిస్ క్యాప్సూల్ కు సంబంధించిన వివరాలను మేము గమనించాము. కారికా బొప్పాయి ఆకు - 325 mg, టినోస్పోరా కార్డిఫోలియా - 125 mg ఉన్నట్లు ఆ వివరణలో ఉంది.
కారికా పపాయా లీఫ్ అనేది బ్లడ్ లో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుంది. పపైన్, కైమోపాపైన్, సిస్టాటిన్, ఎల్-టోకోఫెరోల్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, సైనోజెనిక్ గ్లూకోసైడ్‌స్, గ్లూకోసినోలేట్స్ వంటి అనేక కాంపొనెంట్స్ ను కలిగి ఉంటుంది. ఇవి ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి.
టినోస్పోరా కార్డిఫోలియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది టిష్యూ డ్యామేజ్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
డెంగ్యూ/మలేరియా, ITP (ఇడియోపతిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా), కీమోథెరపీ చికిత్స కోసం డాక్టర్లు కొన్ని సార్లు Thrombobliss Capsule (థ్రాంబోబ్లిస్స్) సిఫార్సు చేస్తారు.
2017లో, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్‌లో ప్రచురించబడిన పరిశోధనా కథనం ప్రకారం టాబ్లెట్ లేదా సిరప్ తీసుకున్న 72 గంటల తర్వాత ప్లేట్‌లెట్ కౌంట్‌లో పెరుగుదల ఉందని పరిశోధన ఫలితాలు చూపించాయి. కారికా పప్పాయా, టినోస్పోరా కార్డిఫోలియా లీఫ్ కలయిక ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుందని, థ్రోంబోసైటోపెనియా చికిత్సకు ఉపయోగించవచ్చని ఈ అధ్యయనం చూపిస్తుంది. అయితే డెంగ్యూ వ్యాధి నివారణకు ఖచ్చితమైన మందు అని మాత్రం అధ్యయనంలో ప్రస్తావించలేదు.
కీమోథెరపీ చికిత్స పొందుతున్న వ్యక్తులు, లేదా సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్, ప్లేట్‌లెట్ కౌంట్‌లో తగ్గుదల ఉన్న రోగులలో కారికా బొప్పాయి, టినోస్పోరా కార్డిఫోలియా లీఫ్ ఎక్స్‌ట్రాక్ట్ (థ్రాంబోబ్లిస్) సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు చేసిన అధ్యయనం, థ్రాంబోబ్లిస్ సామర్ధ్యానికి రుజువును చూపుతుంది
WHO ప్రకారం, డెంగ్యూ లక్షణాలు వ్యాధి సోకినా తర్వాత 4-10 రోజుల నుండి కనిపిస్తాయి. 2-7 రోజుల వరకు ఉంటాయి. డెంగ్యూకి నిర్దిష్ట చికిత్స లేదు. డెంగ్యూ కారణంగా వచ్చే నొప్పిని నివారించే చికిత్సపై వైద్యులు దృష్టి పెడతారు.
ఈ వాదన ను 2019లోనే ఫ్యాక్ట్ లీ తోసిపుచ్చింది.
కాబట్టి, థ్రోంబోబ్లిస్ మాత్రలు, సిరప్ డెంగ్యూని నయం చేయలేవు. రోగిని 2 రోజులలో డిశ్చార్జ్ చేయవచ్చనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Thrombobliss tablets and syrup can cure dengue in 2 days, and the patient can be discharged within 2 days.
Claimed By : Whatsapp Users
Fact Check : Misleading