ఫ్యాక్ట్ చెక్: తెలుగు మహిళా జర్నలిస్ట్ కు చెందిన యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
రిపోర్టర్‌లను ఆన్‌లైన్‌లో వేధించడం, ట్రోలింగ్ చేయడం ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. అది ఈ సమాజానికి ఎంతో ప్రమాదకరంగా
రిపోర్టర్‌లను ఆన్‌లైన్‌లో వేధించడం, ట్రోలింగ్ చేయడం ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. అది ఈ సమాజానికి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. అధికారాన్ని ప్రశ్నించే బలమైన గొంతు బెదిరింపులు, వేధింపులకు గురవుతోంది. మహిళా జర్నలిస్టులు ద్వేషపూరిత, అసభ్యకరమైన విమర్శలను ఎక్కువగా ఎదుర్కొంటారు. వారిని సైలెంట్ చేసే ప్రయత్నంలో ఎన్నో దారుణమైన కామెంట్లు, మెసేజీలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారికి పంపుతూ ఉంటారు.
ఫలానా మతానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ పలువురు జర్నలిస్టులను అదే పనిగా టార్గెట్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరి మీద ఒక్కో రకమైన ముద్ర వేయడమే పనిగా పెట్టుకున్నారు.
తులసి చందు అనే తెలుగు జర్నలిస్ట్ ప్రచురించిన వీడియోల థంబ్‌నెయిల్ చిత్రాల కోలాజ్‌గా ఉన్న చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఆమె యూట్యూబ్‌లో దేశ వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారనే వాదనతో ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వీడియోలను పోస్టు చేస్తున్నారు. మొదటి థంబ్‌నెయిల్ అయోధ్య రామ మందిరంతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు ఉన్నాయి. "ఎందుకు దేవాలయం ఫోటోను ఉంచారు?" అనే వాదనతో తులసి చందు ఫోటో అందులో ఉంది.
రెండవ థంబ్‌నెయిల్ లో ఒక ఆలయం, తులసి చందు కనిపిస్తారు. “సేవ్ దామగుండం, సేవ్ టెంపుల్” అనే టెక్స్ట్ దానిపై ఉంటుంది. మొదటి థంబ్‌నెయిల్ ‘When we build Temple’ శీర్షికతో .. మరో చోట ‘When we build navy base’ శీర్షికతో ఉంచి ఉంటారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టులను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సర్క్యులేషన్‌లో ఉన్న చిత్రాన్ని శోధించినప్పుడు, వైరల్ ఇమేజ్‌లో ఉపయోగించిన థంబ్‌నెయిల్ ఎడిట్ చేశారని మేము కనుగొన్నాము. తులసి చందు తన X ఖాతాలో వైరల్ చిత్రం ఫేక్ అని పేర్కొంటూ పోస్ట్‌ను షేర్ చేశారు. తన పోస్ట్‌లో, యూట్యూబ్ వీడియో కోసం తాను రూపొందించిన థంబ్‌నెయిల్ ఎడిట్ చేశారని, తప్పుడు సందర్భంతో షేర్ చేయబడిందని వివరించారు.
“నేను అయోధ్య మీద చేసిన Thumbnail మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వార్తలు సృష్టించి విద్వేషాలు రేకెత్తించడం వీళ్లకు దినచర్యగా మారిపోయింది. ఇలాంటి వాళ్లు లేటైనా పర్లేదు నైతిక విలువలు నేర్పించే మంచి స్కూల్లో చేరండి. మంచి మానసిక వైద్యులతో చికిత్స చేయించుకొని, ఆరోగ్యకరమైన వాతావరణంలో గడపండి. త్వరగా కోలుకుంటారు. #FactCheck” అంటూ తులసి చందు పోస్టు పెట్టారు.
దీని నుండి ఒక క్యూ గా తీసుకొని, మేము యూట్యూబ్ ఛానెల్ ‘తులసి చందు’ని వెతికాం. అయోధ్య రామ మందిరాన్ని చూపించే అసలు చిత్రం జనవరి 23, 2024న ప్రచురించిన ఆమె వీడియోలో ‘రామ్ మందిర్ పూర్తైంది What Next? || Thulasi Chandu #rammandir #ayodhyarammandir’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. మేము థంబ్‌నెయిల్‌ని తనిఖీ చేసినప్పుడు, దానిపై 'Why Temple' అనే టెక్స్ట్ లేదని మేము కనుగొన్నాము.
థంబ్ నెయిల్ ను ఇక్కడ చూడొచ్చు.
మరో వీడియో ‘Save Damagundam, Save 1200000 trees’ లో దామగుండం అడవి ఉపయోగాల గురించి వివరించారు. దామగుండం అడవి ప్రాముఖ్యతను, అడవిలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూములను కూడా ఇందులో ప్రదర్శిస్తుంది. ఈ సిరీస్‌లో రెండు భాగాలు ఉన్నాయి.
అందువల్ల, ఒక మహిళా తెలుగు జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన థంబ్ నెయిల్స్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. తప్పుడు వాదనతో ఆమెపై పోస్టులు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ చిత్రం ఒక తెలుగు మహిళా జర్నలిస్ట్ సృష్టించిన థంబ్‌నెయిల్‌లను చూపుతోంది, అవి దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేకమైనవి
Claimed By : Twitter users
Fact Check : False