ఫ్యాక్ట్ చెక్: లాక్ డౌన్ విధించి ఎన్నికల్లో అవకతవకలు చేస్తారంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మంకీపాక్స్ గురించి కాదు

ఇటీవల WHO డైరెక్టర్ - జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆఫ్రికాలో మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. మంకీపాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా వర్గీకరించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్

Update: 2024-08-21 04:53 GMT

Trump

ఇటీవల WHO డైరెక్టర్ - జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆఫ్రికాలో మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. మంకీపాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా వర్గీకరించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చే ప్రయాణీకులలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించడానికి అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్ట్‌లలో అప్రమత్తంగా ఉండాలని భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలని జారీ చేసింది. WHO ప్రకారం, సోకిన వ్యక్తితో ప్రత్యక్ష శారీరక సంబంధం ద్వారా మంకీ పాక్స్ ఓ వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ లక్షణాలు సాధారణంగా బహిర్గతం అయిన తర్వాత ఒకటి లేదా మూడు వారాలలో కనిపిస్తాయి. సాధారణంగా దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాపు, అలసట మొదలైనవి ఉంటాయి.

ఇంతలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన వీడియో ఎన్నికల మోసం గురించి హెచ్చరించింది. మంకీపాక్స్ వ్యాప్తి మధ్య అనవసరమైన లాక్డౌన్లను విధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కోవిడ్-19 కాలంలో మాదిరిగానే 'వామపక్షాలు' లాక్‌డౌన్‌లను మళ్లీ విధించేందుకు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలతో ట్రంప్ ఈ వీడియో ప్రచారంలో ఉంది. “Trump warns about lockdowns and election fraud by causing panic. This time with #monkeypox. Refuse to comply!” అనే క్యాప్షన్ తో పలువురు ఈ వీడియోను షేర్ చేశారు. ఎన్నికలకు ముందు లాక్ డౌన్ విధించి మోసం చేసే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు.




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. వీడియో 2023 సంవత్సరానికి చెందినది . ఏ విధంగానూ ఇటీవలి మంకీ పాక్స్ వ్యాప్తికి సంబంధించినది కాదు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ శోధనను అమలు చేయగా ఆ వీడియో ఆగస్టు 2023 నాటిదని మేము కనుగొన్నాము.
సెప్టెంబర్ 15, 2023న డేవిడ్ పాక్‌మాన్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోను మేము కనుగొన్నాము. అందులో '2024 ఎన్నికలను రిగ్గింగ్ చేయడానికి డెమొక్రాట్‌లు కోవిడ్‌ను తిరిగి తీసుకువస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు, ఇది అర్ధవంతం కాదు. ‘ అని చూడొచ్చు. ఈ వీడియోలో, వైరల్ వీడియో 0.46 సెకన్ల నుండి ప్లే అవుతుంది. 
Full View
Kusi News అనే యూట్యూబ్ ఛానల్ లో “TRUMP blasts Democrats for efforts to bring back COVID mandates ahead of 2024” అనే టైటిల్ తో అదే వీడియోను సెప్టెంబర్ 1, 2023న అప్లోడ్ చేశారు. వీడియోలో.. 2024 ఎన్నికలకు ముందు COVID ఆంక్షలను తిరిగి అమలు చేసేందుకు డెమొక్రాట్‌లు ప్రయత్నిస్తూ ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
Full View
తదుపరి శోధనలో, డోనాల్డ్ ట్రంప్, తన స్వంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆగస్టు 31, 2023న ప్రచురించిన అదే వీడియోను మేము కనుగొన్నాము. with the caption “COVID Tyrants want to take away our Freedom. Hear my words— WE WILL NOT COMPLY!” అంటూ వీడియోను పోస్టు చేశారు.
కనుక, డొనాల్డ్ ట్రంప్ వైరల్ వీడియో పాతది. ఇది మంకీ పాక్స్‌కు సంబంధించినది కాదు. వీడియోలో ట్రంప్ కోవిడ్ నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. మంకీపాక్స్ గురించి కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  మాంకీపాక్స్ కారణంగా చూపించి ఎన్నికల్లో మోసం చేసే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు
Claimed By :  Twitter and Instagram Users
Fact Check :  Misleading
Tags:    

Similar News