ఫ్యాక్ట్ చెక్: చేతులు జోడించి హిందూ దేవతలను ప్రార్థిస్తున్న వ్యక్తి న్యూజిలాండ్ హోం మంత్రి కాదు
హిందూ ధర్మాన్ని న్యూజిలాండ్ హోం మంత్రి స్వీకరించారని చెబుతూ.. ఓ విదేశీయుడు నేలపై చేతులు జోడించి కూర్చుని హిందూ దేవతలను ప్రార్థిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
హిందూ ధర్మాన్ని న్యూజిలాండ్ హోం మంత్రి స్వీకరించారని చెబుతూ.. ఓ విదేశీయుడు నేలపై చేతులు జోడించి కూర్చుని హిందూ దేవతలను ప్రార్థిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ముందు, స్వస్తిక వ్రాసిన కొన్ని ఆకులు, సమీపంలో వెలిగించిన దీపాలను మనం చూడవచ్చు. ఈ వీడియోలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం కంపోజ్ చేసిన ‘యుగ్ రామ్ రాజ్ కా ఆ గయా’ పాట ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆయన భారతీయ టీవీ నటి భర్త. అమెరికాకు చెందిన యోగా ట్రైనర్.మేము వీడియోను గమనించగా.. వీడియోలో Instagram లోగో వాటర్‌మార్క్‌తో పాటు @ibrentgoble అని ఉందని కూడా మేము కనుగొన్నాము. మరింత సెర్చ్ చేయగా.. మేము ibrentgoble అనే పేరు ఉన్న ఇంస్టాగ్రామ్ ఖాతాను కూడా కనుగొన్నాము. ఆ అకౌంట్ బయో ప్రకారం అతడి పేరు బ్రెంట్ గోబుల్.. యోగా టీచర్ అని కూడా తెలిపింది.
వైరల్ వీడియోను అతడు నవంబర్ 2, 2023న అప్లోడ్ చేశారు. తన కుమారుడు అలెక్స్ నామకరణంకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. తన జీవితంలో హిందూయిజం ఎలాంటి భాగమో కూడా తెలిపారు. తమ కుటుంబంతో కలిసి ముఖ్యమైన ఆచారాలలో పాల్గొనడం చాలా ఇష్టమని కూడా అందులో తెలిపారు. తన కొడుకు ఎదగాలని, సవాళ్లను అధిగమించాలని, ప్రేమించాలని తాను ప్రార్థిస్తున్నానన్నారు.
అతడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చాడు. ఇప్పుడు భారతదేశంలో నివసిస్తున్నాడు. యోగా సాధనలో నిమగ్నమై ఉన్నాడని అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెబుతున్నాయి.
టీవీ నటి ఆష్కా గోరాడియాను వివాహం చేసుకున్నాడు. నవంబర్ 2023లో అతను వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ జంటకు మగబిడ్డ కలిగాడు.
న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో హోం మంత్రిత్వ శాఖ లేదని చూపిస్తుంది. జనవరి 26, 2024న వెబ్ సైట్‌లో ప్రచురించిన మంత్రిత్వ శాఖల జాబితా ప్రకారం, హోం మంత్రిత్వ శాఖ అనేదే లేదు.. ఇక బ్రెంట్ గోబుల్ ప్రస్తావన కూడా లేదు.
వీడియోలో ఉన్నది న్యూజిలాండ్ హోం మంత్రి కాదు. భారతీయ టీవీ నటిని వివాహం చేసుకుని భారతదేశంలో నివసిస్తున్న యోగా ట్రైనర్‌ని చూపుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : Home Minister of New Zealand adopts Sanatan Dharma
Claimed By : Social media users
Fact Check : False